
సాక్షి, కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణతో బీఆర్ఎస్‌లో దడ మొదలైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదన్నారు. ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తామన్నారు. బీఆర్ఎస్‌ను కాపాడేందుకు బీజేపీ నేతలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
తాము అధికారంలోకి వచ్చి నెలరోజులవుతుంది. గ్యారంటీ స్కీమ్‌లపై దరఖాస్తులు స్వీకరించాం. చిత్తశుద్ధితో అమలు చేస్తాం. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడైతే తనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. జెన్ కోతో పాటు ఇతర శాఖల్లో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళాలి. భూ అక్రమార్కులపై చర్యలు చేపడుతాం’’ అని మంత్రి హెచ్చరించారు.
ఇదీ చదవండి: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment