rekha naik
-
బతుకమ్మలను చూసేందుకు వెళ్తూ..
ఆదిలాబాద్: పండుగ సెలవులకు ఇంటికి వచ్చి బతుకమ్మ వేడుకలను తిలకించేందుకు స్కూటీపై వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృత్యువాతపడిన సంఘటన జన్నారం మండలం పొనకల్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, ఎస్సై సతీశ్ వివరాల ప్రకారం.. పిప్పర్ల గంగన్న సోమవారం రాత్రి 8గంటల ప్రాంతంలో తన కూతురు పిప్పర్ల రాహిత్య(15) తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ప్రధాన రహదారి రేండ్లగూడ వైపు గల తన బంధువు బీట్ అధికారి తరాల్ల సాగర్, జ్యోత్స్న దంపతుల ఇంటికి వచ్చాడు. వారి కూతురు తరాల్ల సాత్విక(18) బైక్‌పై ఎక్కించుకుని ప్రధాన రహదారిపై వెళ్తున్నాడు. చెక్కపెల్లికుంట వద్ద ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అమ్మాయిలు బైక్‌పై నుంచి ఎగిరిపడ్డారు. గంగన్న బైక్ పక్కనే పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు తీవ్రగాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న ముగ్గురిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అంతలోనే రాహిత్య మృతి చెందింది. గంగన్నకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాహిత్య పదో తరగతి చదువుతుండగా సాత్విక నీట్ కోచింగ్ తీసుకుంటుంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పుప్పర్ల గంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పలువురి పరామర్శ ఇద్దరు అమ్మాయిల మృతి విషయం తెలుసుకుని ఎమ్మెల్యే రేఖానాయక్ మంగళవారం ఇరు కుటుంబాలను పరామర్శించారు. తరాల్ల సాత్విక ఇంటికి వెళ్లి కుటుంబీకులను ఓదార్చారు. ఎమ్మెల్యేను చూసి రోదించిన సాత్విక తల్లి జ్యోత్స్నను చూసి ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారు. అదే విధంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఎస్సై సతీశ్‌ను ప్రశ్నించారు. అదే విధంగా బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థి జాన్సన్ నాయక్ మృతుల కుటుంబీకులను పరామర్శించారు. అటవీశాఖ సిబ్బంది, పలువురు నాయకులు, అధికారులు మృతుల కుటుంబీకులను పరామర్శించారు. -
ఇల్లు ఇప్పిస్తామని.. ఎకరం రాయించుకుని.. చివరికి ఇలా చేశారంటూ..
ఆదిలాబాద్: ‘మీ ఊరు చిన్నగా ఉంది. మీ ఊరు మరింత అభివృద్ధి చెందాలంటే ఇక్కడ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించాలి. దీనికి ఎకరం భూమి ఇస్తే.. రూ. 6 లక్షల విలువైన డబుల్ బెడ్రూం ఇస్తాం..’ అంటూ అధికారపార్టీ నేతలు మాటలు చెప్పి ఆ కుటుంబం నుంచి ఎకరం భూమిని సర్కారుకు దానం చేసినట్లు రాయించేశారు. ఏళ్లుగా ఈ విషయం తెలియని బాధితుడు ఇటీవల బయటపడటంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పెంబి మండలం, నాగాపూర్‌కు చెందిన బోసు లక్ష్మి, తిరుపతి దంపతులకు గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. 2018లో ఎకరం భూమిఇస్తే డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని, మీకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, అప్పటి బీఆర్ఎస్ పెంబి మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్ చెప్పినట్లు బాధితులు వాపోతున్నారు. వారు చెప్పినట్లు సంతకాలు పెట్టామన్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు రాకపోవడంతో భూమికోసం వెళ్తే అసలు విషయం బయట పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకున్న ఆధారాన్నీ ఇలా గుంజుకుంటే ఎట్లా బతకాలని కన్నీరుమున్నీరవుతున్నారు. తాజా మాజీ కలెక్టర్ వరుణ్‌రెడ్డిని కలిస్తే ప్రభుత్వానికి దానంగా ఇచ్చినట్లు ఉందని చెప్పారన్నారు. తమకు తెలియకుండా, ఎలాంటి పరిహారం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీన్ని రద్దు చేసి తమ భూమి తమకివ్వాలని ఆ బాధిత దంపతులు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ లక్ష్మణ్‌ని వివరణ కోరగా రిజిస్ట్రేషన్ 2018లో జరిగింది. అప్పట్లో నేను ఇక్కడ విధులు నిర్వహించలేదు. ఈ విషయం నాకు పూర్తిగా తెలియదని చెప్పారు. త్వరలోనే పరిశీలిస్తామని అన్నారు. Follow the Sakshi TV channel on WhatsApp -
ఎన్నికల బరిలో ఉంటా.. ఆశీర్వదించండి
జన్నారం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచే తాను బరిలో ఉంటానని ఎమ్మెల్యే రేఖానాయక్ స్పష్టం చేశారు. మీ ఆశీస్సులు కావాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. చింతగూడ లక్ష్మీదేవి ఆలయంలో పూజలు చేశారు. అక్క డే ఓ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. స్థానిక మహిళలతో ఆప్యాయంగా మాట్లాడా రు. రెండుసార్లు ఆశీర్వదించినట్లుగానే వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించాలని కోరారు. 12 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తనకు ఈసారి టికెట్ ఇవ్వలేదని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో స్థానిక మహిళలు ఎమ్మెల్యేను ఓదార్చారు. తర్వాత ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం ఇటీవల ఆత్మహత్య చేసుకు న్న సీపతి రామ్మూర్తి కుటుంబాన్ని పరమార్శించా రు. అక్కడి నుంచి జన్నారం గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు. మంజూరైన అభివృద్ధి పనులు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జరిగితే తనకు పేరు వస్తుందని ఆరు నెలలుగా కొంతమంది పనులను అడ్డుకుంటుఆ్నరని ఆరోపించారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని తెలిపారు. అనంతరం చింతలపల్లి గ్రామానికి వెళ్లి ప్రజలతో కలిసి మాట్లాడారు. అక్కడ గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట జన్నారం సర్పంచ్ గంగాధర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సతీశ్‌కుమార్, కాంతమణి తదితరులు ఉన్నారు. నృత్యకారులకు సన్మానం.. జిల్లా నృత్య కళాసమాఖ్య అధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో జాతీ య స్థాయికి ఎంపికై న నటరాజ కళాక్షేత్రం విద్యార్థులు గాజుల సహాస్రగౌడ్, శ్రేణు, సంకర్ష్, వర్షిణి, తన్విక, అశ్విత, మోక్షితలను శుక్రవారం సన్మానించారు. కార్యక్రమానికి రేఖానాయక్ హాజరైన మా ట్లాడారు. జాతీయస్థాయి నృత్య పోటీలకు రాష్ట్రం నుంచి 18 మంది ఎంపిక కాగా, అందులో 8 మంది జన్నారం మండలానికి చెందినవారే కావడం గర్వకారణమన్నారు. చిన్నారుల్లోని కళలను వెలికితీసి, వారి ప్రతిభ జాతీయ స్థాయిలో చూపిస్తున్న మాస్టర్లను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా నృత్య కళాసమాఖ్య అధ్యక్షుడు రాకం సంతోష్, డ్యాన్స్ మాస్టర్లు లక్ష్మణ్, రమేశ్, నర్మదగౌడ్, నాయకులు సతీశ్‌కుమార్, కాంతామణి పాల్గొన్నారు. -
Mahabubabad: రేఖా నాయక్ అల్డుడి ఆకస్మిక బదిలీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బదిలీ అయ్యారు. ఆయనను తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్ గుండేటిని నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆకస్మికంగా జరిగిన ఎస్పీ బదిలీపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించగా.. ఊహించని విధంగా బదిలీ కావడానికి ‘రేఖా నాయక్ ఎఫెక్ట్’ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ Ajmeera Rekha Nayak ఎస్పీకి స్వయాన బిడ్డను ఇచ్చిన అత్తగారు. ఈసారి ఆమెకు టికెట్ రాకపోగా, ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రేఖా నాయక్‌పై కోపంతో ఆమె అల్లుడిని ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ మారతానని ప్రకటించిన గంటల్లోనే ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. -
ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తా: రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించింది. అసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చింది. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ అసంతృప్తి నేతలపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతలతో చర్చలు జరుపుతోంది. సాయంత్రం కాంగ్రెస్‌లోకి? ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ రావడంతో ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. కాంగ్రెస్‌లో చేరాలని ఆమె నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ కానున్నారు. సాయంత్రం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని.. పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఖానాపూర్ క్యాడర్ తనతోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే నిర్ణయం ఏదైనా అనుచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని రేఖా నాయక్ పేర్కొన్నారు. ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పారు. త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. కాగా ఇప్పటికే రేఖా నాయక్ భర్త, మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ సోమవారం రాత్రే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన ఆసిఫాబాద్ స్థానం నుంచి రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలోనే రేఖా నాయక్‌ను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకొని ఖానాపూర్ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆయన కూడా అసంతృప్తితోనే కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బోథ్, ఆసిఫాబాద్ స్థానాలకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ పార్లమెంటు సీటు ఇస్తామని చెప్పినా.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. సక్కు గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి గెలిచి వెంటనే బీఆర్ఎస్లో చేరారు. ఇలావుండగా బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌కు కూడా ఈసారి బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. చదవండి: కేసీఆర్ వ్యూహం.. ఇది ప్రత్యర్దులకు రాజకీయ సవాల్ -
రేఖా నాయక్ తిరుగుబాటు..కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే !
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రాజకీయ సమీకరణాలను మారుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో వారిలో ఒకరైన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. కాంగ్రెస్‌లో చేరాలని ఆమె నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ కానున్నారు. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్ ఈ పరిణామాల్లో భాగంగానే.. ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త, మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ సోమవారం రాత్రే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనకు ఆసిఫాబాద్ టికెట్టు ఖరారైనట్లు సమాచారం. రేఖా నాయక్‌ను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకొని ఖానాపూర్ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బోథ్, ఆసిఫాబాద్ స్థానాలకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ పార్లమెంటు సీటు ఇస్తామని చెప్పినా.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. సక్కు గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి గెలిచి వెంటనే బీఆర్ఎస్లో చేరారు. ఇలావుండగా బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌కు కూడా ఈసారి బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. -
కారు పార్టీ ఎమ్మెల్యేలను ఆ బ్రిడ్జీలు ముంచేస్తాయా? విపక్షాలకు సంబరమెందుకు!
నియోజకవర్గాల్లో అభివృద్ధి బాగానే చేశారు. అయినా ఆ ఎమ్మెల్యేలను భయం వెంటాడుతోంది. ఈసారి ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అని సందేహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ నలుగురు ఎమ్మెల్యేల భయానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేలకు ఓడిపోతామనే భయం ఎందుకు పీడిస్తోంది? కారణాలేంటో చూద్దాం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణం పూర్తికాని అసంపూర్తి బ్రిడ్జీలు నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నాయి. వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రగతిని పరుగులు పెట్టించారు. కాని అసంపూర్తిగా ఆగిపోయిన బ్రిడ్జీల్ని పూర్తి చేయడంలో విఫలం అయ్యారు. మూడోసారి కోనప్ప ఆ వైఫల్యమే వారిపట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గానికి రెండుదఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోనేరు కోనప్ప. ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఆయన కోరిక పెద్దవాగుపై కూలిపోయిన వంతెన వల్ల నెరవేరదేమోనని భయపడుతున్నారు. కాగజ్‌నగర్-దహేగామ్ మండలాలను కలిపే ఆ వారధి గత ఏడాది భారీ వర్షాలకు దెబ్బ తిని కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోవడంతో దహేగామ్ మండలంలోని పద్దేనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడాదిగా అక్కడి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచినా పనులు మాత్రం సాగడంలేదు. కూలిపోయిన వంతెన స్థానంలో కొత్తదాని నిర్మాణం ప్రారంభం కాకపోవడానికి ఎమ్మెల్యే కోనప్ప వైఫల్యమే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వంతెన తన పుట్టి ముంచుతుందేమోనని కోనప్ప ఆందోళన చెందుతున్నారు. (చదవండి: మాజీ మంత్రి జూపల్లికి షాక్..!) రేఖ నాయక్‌కు షాకిచ్చేందుకు సిద్ధం? నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు గంగాపూర్ బ్రిడ్జి కలగా మిగిలిపోయింది. కడెం నదిపై బ్రిడ్జి లేక గంగాపూర్ పరిసర ప్రాంతాల్లోని పది గ్రామాల ప్రజలు వర్షకాలంలో తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. అనేకసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి పనులు ప్రారంభించారు. కాని ఆ పనులు పిల్లర్ల దశ దాటలేదు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండా ఉంది. రాకపోకలకు ప్రజలు ఇంత కష్టపడుతున్నా ఎమ్మెల్యే రేఖనాయక్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందట. వంతెన నిర్మిస్తామని చెప్పి మాట తప్పిన ఎమ్మెల్యేకు ఎన్నికలలో బుద్ది చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారట. ఆత్రం సక్కు తీరుపై ఆగ్రహం.. కుమ్రంబీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గుండేగామ్ గ్రామానికి పక్కనే ఉన్న వాగుపై దశాబ్దం క్రితం వంతెన నిర్మాణం ప్రారంభించారు. ఇన్నేళ్ళయినా ఆ వంతెన పనులు పిల్లర్ల దశ దాటలేదు. వంతెన లేకపోవడంతో గ్రామస్థులు పుట్టి, తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. వాగుకు వరద వచ్చినపుడు ప్రమాదాల బారినపడుతున్నారు. అదేవిధంగా కెరమెరి మండలం కరంజీవాడ వాగుపై కూడా వంతెన లేదు. వంతెన కోసం పునాదులు తవ్వి వదిలేశారు. ఈ ప్రాంతంలో పది గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినపుడు రోజుల తరబడి ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. ప్రజల కష్టాలు తెలిసినప్పటికీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పట్టించుకోవడంలేదని ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వంతెన కోసం అవసరమైతే ఎన్నికలు బహిష్కరించాలన్న ఆలోచనతో ఉన్నారని టాక్ నడుస్తోంది. (చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు) కష్టాలకు బదులివ్వడం ఖాయమా.. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ మండలం తరోడాలో అంతరాష్ట్ర రహదారిపై ఉన్న వాగుపై ఓ వంతెన ఉంది. పగుళ్లుబారి ప్రమాదకరమైన స్థితికి చేరడంతో దానిపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారు నానా కష్టాలు పడుతున్నారు. నియోజకవర్గంలోని జైనథ్, బేల మండలాల ప్రజలకు ఈ వంతెన ఎంతో ముఖ్యమైనది. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేయించడంతో ఎమ్మెల్యే జోగు రామన్న విఫలమయ్యారని అక్కడి ప్రజలు, విపక్షాలు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలకు అవసరమైన పనులు చేయించలేని ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలని ప్రతిపక్షాలు పిలుపునిస్తున్నాయి. ఈ వంతెనే అధికార పార్టీని ఓడించబోతోందని, తమను గెలిపించబోతోందని విపక్ష నేతలు సంబరపడుతున్నారు. ఇదిలా ఉంటే విపక్షాల విమర్శలను అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. వంతెనలు నిర్మించడం అంటే నిచ్చెనలు వేసినంత సులువుకాదంటున్నారు. బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినా తమ మీద అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, నియోజకవర్గాల్లో తాము సాధించిన అభివృద్ధి పనులే మరోసారి తమను గెలిపిస్తాయని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
సోషల్‌మీడియాలో సర్వే రిపోర్టులు!
సాక్షి, ఆదిలాబాద్: ప్రస్తుత వాతావరణం చల్లబడినా జిల్లాలోని రాజకీయ పరిణామాలు మాత్రం వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. సోషల్ మీడియాలో సర్వే రిపోర్టులు వెల్లడి కాగా ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సర్వే ఫలితం ఏ పార్టీలో ఎవరికి అనుకూలంగా ఉందని సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా, సర్వే అనుకూలంగా ఉన్న నేతలు సైలెంట్‌గా ఉంటుండగా, మిగతావరు ఫేక్ సర్వే అని కొట్టి పడేస్తున్నారు. మరో పక్క అధికార పార్టీలో ప్రధానంగా బోథ్, ఖానా పూర్ నియోజకవర్గాలో ఆశావహులు పోటాపోటీగా తమ బలబలాలను ప్రదర్శిస్తున్నారు. అధిష్టానం దృష్టిలో పడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. బోథ్‌లో.. నియోజకవర్గంలో అధికార పార్టీ లో నేతల మధ్య తీవ్రపోటీ నెలకొంది. మొన్నటివరకు సైలెంట్‌గా ఉన్న మాజీ ఎంపీ గోడం నగేశ్ ఇటీవల దూకుడు పెంచారు. నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందుంటున్నారు. ఆయన వెంట తాంసి, భీంపూర్ జెడ్పీటీసీలు తాటిపెల్లి రాజు, కుమ్ర సుధాకర్, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఉంటున్నారు. ఇటీవల తన బర్త్‌డే వేడుకలతో హంగామా చేసిన నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్‌జాదవ్ కూడా తన అనుచరులతో కలిసి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందుంటున్నారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక.. బీజేపీలో సాకటి దశరథ్, బలరాం జాదవ్ టికెట్ ఆశిస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బోథ్ నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఆయన ఈ నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నేతలు నరేశ్‌జాదవ్, ఆడె గజేందర్, వన్నెల అశోక్‌తో పాటు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు రాథోడ్ పార్వతి టికెట్ ఆశిస్తున్నారు. ఖానాపూర్‌లో.. ఖానాపూర్ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ మరోసారి టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. రవాణాశాఖలో పని చేస్తూ స్వచ్ఛంద విరమణ పొందిన శ్యాంనాయక్‌తోపాటు శర్వన్ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు అధిష్టానం ఆశీస్సులు తనకూ ఉన్నాయని జాన్సన్ నాయక్ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందుంటున్నారు. బీజేపీ నుంచి రాథోడ్ రమేశ్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇక.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో పార్టీ కార్యక్రమాల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు ముందుంటున్నారు. గతంలో మహేశ్వర్‌రెడ్డి అనుచరులుగా ఉన్న చారులత ప్రస్తుతం ప్రేమ్‌సాగర్‌రావు వర్గంగా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి భరత్‌చౌహాన్ కూడా రేసులో ఉన్నారు. ఆదిలాబాద్‌లో.. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న మరోసారి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా టికెట్ ఆశిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ ముందుంటున్నారు. అధిష్టానం ఆశీస్సులు తనవైపే ఉన్నాయన్న భరోసాతో ఉన్నారు. ఇక.. కాంగ్రెస్‌లో సర్వేల అలజడి నెలకొంది. ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్‌రెడ్డి, గండ్రత్ సుజాతతోపాటు అనూహ్యంగా భార్గవ్ దేశ్‌పాండే పేరు వినిపిస్తుండడం గమనార్హం. టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో మకాం వేశారు. ప్రధానంగా పార్టీ చేపట్టిన సర్వే వేటిని ప్రామాణికంగా తీసుకున్నారనే విషయంపై కొంతమంది రాష్ట్ర నేతలను కలిసి అసంతృప్తి వ్యక్తంజేశారు. ఇటీవల హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారులతో జరిగిన సమావేశంలోనూ సాజిద్‌ఖాన్ పాల్గొన్నారు. ఈ పరిణామాలన్నీ ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో ఆసక్తి కలిగిస్తున్నాయి. బీజేపీలో జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ చిట్యాల సుహాసినిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ఎన్నికైన తర్వాత తమకు అనువుగా పరిస్థితులను మార్చుకునేందుకు ఇద్దరు నేతలు యత్నిస్తున్నారు. -
ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
-
తొలిసారి గిరిజన ఎమ్మెల్యేకు సోకిన కరోనా
నిర్మల్ జిల్లా: ఏడాది కాలంగా కరోనా దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. అయితే గిరిజన ప్రాంతాలకు మాత్రం ఆ వైరస్ పాకడం లేదు. వారు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు వారికి శ్రీరామరక్షగా నిలుస్తోంది. అయితే తొలిసారిగా గిరిజన ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. ఆమెనే ఖానాపూర్ టీఆర్ఎస్ రేఖానాయక్. ఇటీవల ఆమె పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె వెంటనే హోం క్వారంటైన్లోకి వెళ్లారు. చదవండి: నేడో రేపో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా? చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ఉట్నూర్‌రూరల్: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే షాదిముబారాక్, కల్యాణలక్ష్మి వంటి పథకాల ద్వారా నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 13 కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు ఒక్కరికి రూ.66 వేల సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి చూపుతుందని పేర్కొన్నారు. అంతే కాకుండా గ్రామస్థాయి నుంచి అభివృద్ధి పనులు చేపట్టడంలో, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విమల, జెడ్పీటీసీ జగ్జీవన్, వైస్ ఎంపీపీ సలీం, సర్పంచ్‌లు బొంత ఆశారెడ్డి, మర్సుకోల తిరుపతి, కో–ఆప్షన్ మెంబర్ ముజీబ్, తహసీల్దార్ అతీక్ ఒద్దిన్, డీటీ విశ్వనాథ్, ఎంపీటీసీ సభ్యులు అమీనబీ, శారద, కందుకూరి రమేశ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దిన్, నాయకులు షౌకత్, లతీఫ్, పంద్ర జైవంత్‌రావు, తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత దస్తురాబాద్: మండలంలోని పెర్కపల్లే గ్రామానికి చెందిన పుష్పకు మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ శుక్రవారం ఖానాపూర్లోని తన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీటీసీ వియంరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చుంచు భూమన్న తదితరులు పాల్గొన్నారు. -
ముదిరిన ‘ఖానాపూర్’ లొల్లి
►రేఖానాయక్ వర్సెస్ రమేశ్‌రాథోడ్.. ►‘పట్టు’ కోసం ఇరువురి మధ్య పోటాపోటీ ►రోజురోజుకూ వేడెక్కుతున్న రాజకీయం ►సీఎం పర్యటనకు ముందే ఇద్దరి మధ్య గొడవ ►రెండుగా చీలిపోయిన పార్టీ వర్గాలు ►మాజీ ఎంపీపై పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు నిర్మల్‌రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్ పక్క జిల్లాకు వస్తున్న రెండురోజుల ముందు జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ పరంగా ఖానాపూర్ నియోజకవర్గంలో లొల్లి రాజు కుంది. నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవడంలో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ల మధ్య కొనసాగుతున్న వార్ మరోమారు బయటపడింది. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సాక్షిగా పార్టీ కార్యకర్తల సమక్షంలోనే మంగళవారం వీరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ‘నువ్వెంత.. అంటే నువ్వెంత.. బతకడానికి వచ్చిందెవరు.. నువ్వా నేనా..’ అనే స్థాయిలో ఎమ్మెల్యే, మాజీ ఎంపీల మధ్య రభస సాగింది. వీరిద్దరితో పాటు వీరి వర్గాల మధ్యనా గొడవ చోటుచేసుకుంది. పోటాపోటీ నినాదాలతో ఆయా వర్గాల నాయకులు, కార్యకర్తలు హోరెత్తించారు. ఎమ్మెల్యే రేఖానాయక్ ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై దురుసుగా ప్రవర్తించాడంటూ మాజీ ఎంపీపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జరిగిన పార్టీ సమావేశంలో చోటుచేసుకున్న ఈ సంఘటన జిల్లాలో ప్రస్తుతం చర్చనీ యాంశంగా మారింది. ఖానాపూర్ నియోజకవర్గంపై పట్టు నిలుపుకునేందుకు ఇరువర్గాలు చేస్తు న్న ప్రయత్నాలు మరోమారు బయటపడ్డాయి. గతంలోనూ గొడవలు ఖానాపూర్‌లో తాజా ఎమ్మెల్యేకు.. మాజీ ఎమ్మెల్యేకు మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. ఖానాపూర్ ఆస్పత్రిలో జరిగిన సంఘటనలో తనపై గన్‌మెన్‌ను తోసేసి, అసభ్యంగా ప్రవర్తించాడంటూ రమేశ్‌రాథోడ్‌పై రేఖానాయక్ ఆరోపించారు. ఖానాపూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తంచేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. పలు సభలు, సమావేశాల్లో వీరిద్దరు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. ప్రతిపక్ష టీడీపీలో సీనియర్‌గా ఉన్న రమేశ్ రాథోడ్ ఏళ్లపాటు పాలించి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేయలేదంటూ ఎమ్మెల్యే చాలా సందర్భాల్లో మండిపడ్డారు. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ ఆయనపై మాటల దాడికి దిగారు. మాజీ ఎంపీ సైతం అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేయడం లేదంటూ విమర్శలు గుప్పించారు. రాథోడ్ టీఆర్ఎస్లోకి రావడంతో.. ఒకే నియోజకవర్గంలో ఉప్పు..నిప్పులా ఉన్న ఇద్దరూ ఒకే పార్టీ వారు కావడం లొల్లిని మరింత ముదిరేలా చేసింది. రెండు నెలల క్రితం ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పైడిపల్లి రవీందర్‌రావుతో కలిసి రమేశ్‌రాథోడ్ టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే రేఖానాయక్ మరింత గుర్రుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ విషయంలో తనకు పోటీగానే టీఆర్ఎస్లో చేరాడని రాథోడ్‌పై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటిదాకా టీఆర్ఎస్, ప్రభుత్వాన్ని తిట్టిన వ్యక్తి.. ఇప్పుడు ఎందుకు పార్టీలోకి వచ్చారంటూ మండిపడ్డారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక స్థానికంగా పట్టు కోసం శ్రమిస్తున్నారు. పోటాపోటీగా... ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి విడిపోయిన మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏకైక నియోజకవర్గం ఖానాపూర్. నాలుగు జిల్లాలతోనూ సంబంధాలు కలిగి ఉన్న ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమిది. ఒకప్పుడు టీడీపీ నుంచి రమేశ్ రాథోడ్ ఏళ్లపాటు ఇక్కడ పట్టు నిలబెట్టుకున్నారు. ఆయన ఎంపీగా వెళ్లినా భార్య సుమన్‌బాయిని ఎమ్మెల్యేగా గెలిపిం చుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన రేఖానాయక్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందా రు. అప్పటి నుంచి రాథోడ్ మళ్లీ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన యత్నాలకు గండి కొడుతూ తనదే పైచేయిగా సాధించేం దుకు రేఖానాయక్ పావులు కదుపుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటం, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు నేపథ్యంలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ప్రస్తు తం ఖానాపూర్ టీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయి ఉంది. ఏ కార్యక్రమం జరిగినా పోటాపోటీగా తమ ప్రదర్శన చేస్తూనే ఉన్నాయి. -
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అరెస్ట్
ఆదిలాబాద్: మాజీ టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్ గన్ మెన్ పై దాడి ఘటనకు సంబంధించి రాథోడ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. గత మూడు రోజుల క్రితం జిల్లాలో్ని కడెం రోడ్డులోని ప్రమాద బాధితులను రేఖానాయక్ పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఆమె గన్ మెన్ పై రాథోడ్ దాడికి పాల్పడ్డాడు. దీనిపై రేఖా నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి నిర్మల్ కోర్టులో హాజరుపరిచారు. -
ఎమ్మెల్యే గన్ మెన్ పై మాజీ ఎంపీ దాడి
కడెం రోడ్డు ప్రమాద బాధితులని పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే రేఖా నాయక్ గన్ మెన్ పై మాజీ ఎంపీ రమేష్ రాథోడో దాడి చేశారు. దీనికి నరసనగా రమేష్ రాథోడ్ ను అరెస్ట్ చేయాలంటూ రేఖా నాయక్ రోడ్డుపై బైఠాయించారు. -
తెలంగాణ వారికి ప్రత్యేక ప్యాకేజీ
ఎమ్మెల్యే రేఖా నాయక్ హామీ బోరివలి, న్యూస్‌లైన్: ముంబైలో స్థిరపడిన లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటుకు కృషిచేస్తానని ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే (టీఆర్ఎస్) రేఖా నాయక్ హామీ ఇచ్చారు. రెండు రోజులపాటు ముంబై సందర్శించేందుకు వచ్చిన ఆమె తెలుగువారు నివసిస్తున్న పలు ప్రాంతాలను సోమవారం పర్యటించారు. బోరివలి, శాంతాకృజ్‌లలో ఖానాపూర్ నియోజక వర్గం ప్రజలు వేల సంఖ్యలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ మురికివాడలలో నివసిస్తున్న తెలంగాణవాసులను చూసి ఆమె చలించి పోయారు. బోరివలిలోని దౌలత్‌నగర్‌లో ఇంటింటికి వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాలలో వలసవాసుల సమస్యలను లేవనెత్తుతానని, అలాగే వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, సమగ్ర సర్వే రోజున తాము పేర్లు నమోదు చేసుకోలేదని, తమకు రైళ్లు, బస్సుల్లో టికెట్ లభించక పోవడంతో ఆ రోజు సొంత గ్రామాలకు రాలేకపోయామని స్థానికులు కొందరు ఎమ్మెల్యేతో విన్నవించుకున్నారు. కాగా, వీరి కోసం ప్రత్యేకంగా సర్వే నిమిత్తం త్వరలో ఒక తేదీ ప్రకటిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా బోరివలిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రజలు వేల సంఖ్యలో నివసిస్తున్నారు. దీంతో తమకు అనుకూలంగా ఉండేలా ఆదిలాబాద్ నుంచి ముంబైకు బస్సు వెయ్యాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. దీనికి కూడా రేఖా నాయక్ సానుకూలంగా స్పందించారు. మంచిర్యాల డిపో నుంచి బోరివలి వరకు త్వరలో బస్సు ప్రారంభానికి కృషి చేస్తానని తెలిపారు. పర్యటనలో ఎమ్మెల్యే వెంట ఆమె భర్త శ్యామ్ నాయక్ , ఖానాపూర్ నియోజక వర్గానికి చెందిన గాజుల నర్సారెడ్డి, నీరటి భూమన్న, రవినాయక్, గాజుల మహేష్, నీరటి మల్లేష్ తదితరులు ఉన్నారు. -
ఒంటరి పోరు.. కారుదే జోరు
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒంటరి పోరు తో 2014లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో పాటు కొత్త రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడంలో సఫలమైంది. తాజా ఎన్నికల్లో జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ఏడు స్థానాల్లో అతి సులభంగా గెలుపొందింది. అదే విధంగా ఆది లాబాద్ పార్లమెంటు స్థానాన్ని సైతం భారీ మెజార్టీ తో దక్కించుకొని తిరుగులేని పార్టీగా జిల్లాలో నిల బడింది. 2004లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పె ట్టుకొని జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ముథోల్, బోథ్, ఖానాపూర్ అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తూ ర్పు ప్రాంతంలోని చెన్నూర్, మంచిర్యాల, సిర్పూర్(టి) అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో గెలిచిన ఏడుగురిలో నలుగురు కొత్తవారు కావడం విశేషం. మరో ముగ్గురు సీనియర్లు ఉన్నారు. బోథ్ నుంచి గెలిచిన రాథోడ్ బాపురావు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి తన కం టే రాజకీయాల్లో సీనియర్, అదే ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన సోయం బాపురావును ఓడించారు. బెల్లంపల్లి నుంచి రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని దుర్గం చిన్నయ్య తనకంటే సీనియర్, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లేశ్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆసిఫాబాద్ నుంచి గెలిచిన కోవ లక్ష్మి కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సి ట్టింగ్ ఎమ్మెల్యే, పెద్ద నాయకుని అండ ఉన్న సక్కు ను ఓడించి సత్తా చాటుకున్నారు. ఖానాపూర్ నుంచి గెలిచిన రేఖానాయక్ కూడా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రాథోడ్ రమేశ్ కుమారుడు రితీశ్ రాథోడ్‌ను ఎదుర్కొని విజయాన్ని అందుకొంది. పాతవారిలో ఆదిలాబాద్ నుంచి గతంలో రెండుసార్లు గెలుపొందిన జోగు రామన్న ఈసారి సులువుగానే బయట పడ్డారు. చెన్నూర్ నుంచి మూడో సారి గెలుపొందిన నల్లాల ఓదెలు కూడా స్థానిక అంశం, కార్మికుల అండ కలిసిరావడం కలిసి వచ్చింది. మంచిర్యాల నుంచి మూడో సారి గెలుపొందిన దివాకర్‌రావు చివరి సమయంలో టీఆర్ఎస్లో చేరి పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.