లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే
ఉట్నూర్‌రూరల్: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే షాదిముబారాక్, కల్యాణలక్ష్మి వంటి పథకాల ద్వారా నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 13 కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు ఒక్కరికి రూ.66 వేల సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి చూపుతుందని పేర్కొన్నారు. అంతే కాకుండా గ్రామస్థాయి నుంచి అభివృద్ధి పనులు చేపట్టడంలో, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు.
రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విమల, జెడ్పీటీసీ జగ్జీవన్, వైస్ ఎంపీపీ సలీం, సర్పంచ్‌లు బొంత ఆశారెడ్డి, మర్సుకోల తిరుపతి, కో–ఆప్షన్ మెంబర్ ముజీబ్, తహసీల్దార్ అతీక్ ఒద్దిన్, డీటీ విశ్వనాథ్, ఎంపీటీసీ సభ్యులు అమీనబీ, శారద, కందుకూరి రమేశ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దిన్, నాయకులు షౌకత్, లతీఫ్, పంద్ర జైవంత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
దస్తురాబాద్: మండలంలోని పెర్కపల్లే గ్రామానికి చెందిన పుష్పకు మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ శుక్రవారం ఖానాపూర్‌లోని తన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీటీసీ వియంరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చుంచు భూమన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment