devoelpment
-
నీవే స్ఫూర్తి.. నీదే కీర్తి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాటిస్తే నిలబెట్టుకోవాలి. హామీ ఇస్తే ఎలాగైనా అమలు చేయాలి. కష్టాన్ని కనిపెట్టి కన్నీరు తుడవాలి.. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి నేర్పిన పాఠాలివి. ముఖ్యమంత్రిగా ఆయ న అనుసరించిన విధానాలూ ఇవే. అందుకే మరణించాక కూడా ఆయన జనం గుండెల్లో బతికున్నారు. సంక్షేమానికి ఆయన పేరునే శాశ్వత చిరునామాగా మార్చేశారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఉద్దానానికి మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ పరిశోధన కేంద్రం వంటి ప్రాజెక్టులతో సిక్కోలుపై వరాలు కురిపిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో.. ►శ్రీకాకుళానికి ఓ పెద్దాసుపత్రి ఉండాల్సిందేనని భావించి ప్రజలు కోరకుండానే రిమ్స్ వైద్య కళాశాలను, ఆస్పత్రిని నిర్మించారు. ►సిక్కోలు జిల్లాకు యూనివర్సిటీని అందించారు. ఎచ్చెర్లలో 2008 జూలై 25న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడీ వర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత విద్యావేత్తలుగా తీర్చిదిద్దుతోంది. ►ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేశారు. ►ప్రతి చుక్క నీటిని అందిపుచ్చుకుని, రైతుకు అందించాలని అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 2005 మే నెలలో వంశధార స్టేజ్ 2, ఫేజ్2 ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 20 మండలాల్లో 2.55లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టారు. ►జిల్లాలోని హిరమండలం వద్ద సుమారు 10వేల ఎకరాల్లో 19 టీఎంసీల నీటి నిల్వ కోసం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. తోటపల్లి ఫేజ్ 2 పనుల ఘనత ఆయనకే దక్కుతుంది. ►సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.123.25 కోట్లతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ►వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులు పూర్తయితే 2.55లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వైఎస్సార్ అప్పట్లోనే పనులకు శ్రీకారం చుట్టారు. ►∙12,500 ఎకరాల సాగునీటి కోసం మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్ 1 పనులను రూ.57.87కోట్లతో చేపట్టారు. ►నాగావళి, వంశధార నదుల వరద ఉద్ధృతి నుంచి పంట పొలాలను, ఆవాసాలను రక్షించేందుకు రూ. 300కోట్లతో కరకట్టల నిర్మాణాలకు సంకల్పించారు. ►సీతంపేట ఏజెన్సీలో 14 వేల ఎకరాల్లో 5వేల మంది గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చారు. ►రైతులను ఆదుకున్న ఏకైక నేత వైఎస్సారే. 2.5లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశారు. అప్పటికే రుణాలు చెల్లించేసిన వారికి రూ. 5వేలు చొప్పున ప్రోత్సాహం అందించారు. ►చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పేదలకు 1,80,817 ఇళ్లు మంజూరు చేసి అందులో 1,63,140ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. ►నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో 2007లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీతో వేలాది మందికి జీవం పోశారు. 938 రకాల వ్యాధులకు కార్పొరేట్ వైద్యం అందించారు. ►ప్రమాద బాధితులకు అత్యవసర సమయంలో ఆస్పత్రిలో చేర్పించి ప్రాణం నిలబెట్టవచ్చని 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు. గ్రామీణులకు ప్రతి నెలా వైద్యం అందించడానికి 104 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ►పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ చదువులు అందించాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉన్నత విద్యాభ్యాసానికి కొండంత అండగా నిలిచారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో బీసీ విద్యార్థులే 72 వేలకు పైగా ఉన్నారు. -
కుప్పంను వీడుతున్న ‘చంద్ర’ గ్రహణం
సాక్షి, చిత్తూరు: కులం చూడం.. మతం చూడం.. వర్గాలు చూడం.. పార్టీలు చూడం.. రాజకీయాలు చూడం.. అందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తాం.’’ వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఈ హామీలను ముఖ్యమంత్రి కాగానే అక్షరాలా నిజం చేసి చూపించారు. కులాలు, మతాలు, వర్గాలే కాదు.. రాజకీయలకు అతీతంగా కూడా అభివృద్ధి ఫలాల్లో అందరికీ సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గమే. ఈ నియోజకవర్గ ప్రజలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించినా.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇక్కడి ప్రజలకు పెద్ద దిక్కుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. 14,653 మందికి ఇళ్లపట్టాలు కుప్పం నియోజకవర్గంలో ఈ రెండేళ్లలోనే 14,653 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు అందజేశారు. గత టీడీపీ హయాంలో 5,158 మందికి ఇళ్లపట్టాలకు అనుమతి ఇచ్చి 4,150 మందికి మాత్రమే పంపిణీ చేశారు. హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద గతంలో ఐదేళ్లలో 4,691 మంది లబ్ధిపొందగా.. ఈ రెండేళ్లలోనే 3,712 మందికి లబ్ధిచేకూరింది. అర్హులందరికీ పింఛన్లు గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల ఆమోదం ఉంటేనే పథకాలు లభించేవి. ప్రస్తుతం అలా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన ప్రజలందరికీ నేరుగా సంక్షేమ పథకాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో 2014–19 మధ్య 30,970 మందికి పింఛన్లను పంపిణీ చేశారు. ఇందుకు కేటాయించిన నిధులు రూ. 653.41 లక్షలు. ప్రస్తుతం అదే నియోజకవర్గంలో గతంకన్నా ఎక్కువగా 34,956 మందికి రూ.844.83 లక్షల మేర పింఛన్లు అందిస్తున్నారు. గతంలో 44 భవనాలు.. ప్రస్తుతం 83 గత ఐదు సంవత్సరాల పాలనలో చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 44 పక్కా ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించారు. ప్రస్తుతం రెండేళ్లలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 83 గ్రామ సచివాలయ, పంచాయతీ భవనాలను నిర్మించారు. గతంలో 44 భవనాలకు రూ.592 లక్షలు ఖర్చు చేయగా, ప్రస్తుతం 83 భవనాలకు రూ.2480 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. గతం కన్నా నాలుగింతలు ఎక్కువ నిధులతో నాణ్యమైన, అధునాతన హంగులతో భవనాలను నిర్మిస్తున్నారు. 13,486 మందికి ఆరోగ్య‘సిరి’ 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గంలో 13,468 మందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స చేయించారు. ఈ పథకం ద్వారా వారికి రూ.23కోట్ల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గత పాలనలో 9,348 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలను అందించారు. అదేవిధంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా 750 మందికి చికిత్సలు చేయించారు. 53,187 మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదు కుప్పం నియోజకవర్గంలోని సర్కారు, ఇతర యాజమాన్యాల బడుల్లో చదువుతున్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా ఆదుకుంది. 53,187 మంది తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.7978.05 లక్షలను జమచేసింది. గత పాలనలో పిల్లల చదువులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పరిస్థితి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పిల్లల చదువులకు అమ్మఒడి పథకంలో ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. సర్కారు బడుల అభివృద్ధికి రూ.1853.84 లక్షలు కుప్పం నియోజకవర్గంలోని సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 2019–20 సంవత్సరాల్లో 46 సర్కారు బడుల నూతన భవనాలను రూ.715.84 లక్షలను ఖర్చు చేసి నిర్మిస్తున్నారు. అలాగే 43 సర్కారు బడులను నాడు–నేడు పథకం ద్వారా రూ.1138 లక్షలతో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ బడులకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. గత సర్కారు 85 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించి చేతులు దులుపుకుంది. ఉన్నత కోర్సులకు చేయూత ఇంటర్మీడియట్ తర్వాత పై చదువులు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆ నియోజకవర్గంలో చదువుతున్న 14,646 మంది విద్యార్థులకు రూ.14.31కోట్లతో జగనన్న విద్యాదీవెన, 15,498 మందికి రూ.10.57 కోట్లతో జగనన్న వసతి దీవెన పథకాన్ని అమలు చేశారు. ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం ►కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ప్రజలు బెంగళూరుకు వెళ్లాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పించేలా గ్రానైట్ సర్వే స్టోన్ కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. కుప్పం పరిధిలోని దళవాయి కొత్తపల్లి సమీపంలో పల్లార్లపల్లి వద్ద 4 ఎకరాల స్థలంలో యూనిట్ ఏర్పాటవుతోంది. ►కుప్పం నడిబొడ్డున ఉన్న గంగమ్మ దేవాలయాన్ని పునర్నిర్మించాలన్నది స్థానికుల కల. ఏటా నిర్వహించే జాతరకు సమీపంలోని కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప దేవాలయ పునర్నిర్మాణానికి రూ.3.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. గుడి ముందు 70 సెంట్ల డీకేటీ స్థలాన్ని అగ్నిగుండంకు కేటాయించనుండటం విశేషం. ►కుప్పంకు సమీపంలోని డీకేపల్లి, కుప్పం నగరంలోని రైల్వేబ్రిడ్జిల సమస్య 2004వ సంవత్సరం నుంచి అపరిష్కృతంగానే ఉంది. ఈ సమస్య వల్ల సమీపంలోని 60 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారానికి చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప చొరవ చూపి అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రెండు నూతన రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలను నిర్మించి ప్రారంభించారు. -
భూములిస్తే.. వరాలిస్తాం!
సాక్షి, మహబూబ్‌నగర్: గండేడ్ మండలం కుక్కరాళ్లగుట్ట, రెడ్డిపల్లికి చెందిన దళిత రైతులపై వరాల జల్లు కురిసింది. రూర్బన్ పథకం కింద మంజూరైన అభివృద్ధి పనుల కోసం అవసరం మేరకు భూములిస్తే దానికి బదులు వేరేచోట సాగు భూమి, డబుల్బెడ్రూం ఇల్లు, ఆ ప్రాంతంలో ఏర్పాటయ్యే సంస్థల్లో కుటుంబానికో ఉద్యోగం ఇస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం గండేడ్ తహసీల్దార్ జ్యోతితో కలిసి మండల పరిషత్ కార్యాలయంలో దళిత రైతులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ రూర్బన్ పథకానికి ఎంపికైన మండలానికి అనేక అభివృద్ధి పనులు మంజూరైన నేపథ్యంలో మండల, గ్రామ అభివృద్ధి కోసం తమ వంతుగా సహాకారం అందించాలని కోరారు. అయినా రైతులు మాత్రం మెట్టు దిగి రాలేదు. భూములిచ్చే విషయంపై పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అప్పటివరకు తమ భూములను వదిలిపెట్టాలన్నారు. సముదాయించే ప్రయత్నం సుమారు 50ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిరుపేద దళితులకు ఇచ్చిన 80ఎకరాల్లో ఇప్పుడు అభివృద్ధి పేరిట 30ఎకరాల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. కొన్ని నెలలుగా దళిత రైతులు దీనిని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బుధవారం ‘లాగేసుకుంటున్నారు!’ అనే శీర్షికతో ‘సాక్షి’తో సమగ్ర కథనం ప్రచురించితమైంది. దీంతో రంగంలో దిగిన ఎమ్మెల్యే, తహసీల్దార్ అక్కడి రైతులతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. కొందరు గ్రామ పెద్దలు మాత్రం ప్రభుత్వం భూముల్ని అభివృద్ధి కోసం తీసుకుంటున్నందున పునరాలోచించాలని దళిత రైతులకు సూచించారు. వాస్తవానికి గండేడ్ మండల కేంద్రానికి ఆనుకునే ఉన్న కుక్కరాళ్లగుట్ట వద్ద సర్వే నం.313లో 71.39 ఎకరాలు, రెడ్డిపల్లి రెవెన్యూ శివారులోని సర్వే నం.40లో 29.04 ఎకరాలు ఇలా మొత్తం 100.43 ఎకరాలున్నాయి. వీటిలో 80ఎకరాలను ఆయా గ్రామాలకు చెందిన సుమారు 40కుటుంబాలకు 1970లోనే అప్పటి ప్రభుత్వం అసైన్డ్ చేసింది. మిగిలిన 20.43 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే దళితులకు అప్పట్లో ఎకరన్నర నుంచి మూడున్నర ఎకరాల వరకు భూములు పంపిణీ చేశారు. మొత్తం గుట్ట ప్రాంతంలో ఉన్న భూములను ఎంతో కష్టపడి సాగుకు యోగ్యంగా మార్చుకున్న రైతులు వాటిలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ఇందులో రైతుల నుంచి ప్రస్తుతం ఎనిమిదెకరాలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతుండగా రైతులు మాత్రం 30 ఎకరాల వరకు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేకరించే ఈ భూముల్లో మినీస్టేడియం, డబుల్బెడ్రూం ఏడెకరాల చొప్పున, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్, హర్టికల్చర్‌కు ఐదెకరాల చొప్పున, అగ్రికల్చెర్ గోడౌన్‌కు మూడెకరాలు, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, కన్వెన్షన్‌హాల్, మాణికేశ్వరి టెంపుల్‌కు ఎకరం చొప్పున, ఆడిటోరియం, మిల్క్‌ప్రాసెసింగ్ యూనిట్‌కు రెండెకరాల చొప్పున నిర్మాణాలు జరగనున్నాయి. -
మూడో ఏడాదిలోకి ‘మెదక్ జిల్లా’
మెదక్ నూతన జిల్లాగా అవతరించి నేటితో రెండేళ్లు పూర్తయింది. పలువురు అభివృద్ధి జరిగిందని ఆనందపడుతుంటే.. కొందరు మాత్రం మరిన్ని కష్టాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాటుకు ముందు ప్రతీ పనికి సంగారెడ్డికి పరుగులు తీయాల్సిన పరిస్థితి. దీంతో అభివృద్ధి ఆమడ దూరంలో ఉండేది. దూరాభారంతో ప్రజలకు అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రత్యేక జిల్లా కోసం డిమాండ్ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనతో మెదక్ ప్రాంత ప్రజల చిరకాల కల నెరవేరింది. 11 అక్టోబర్, 2016లో తెలంగాణ చిత్రపటంపై మెదక్ ప్రత్యేక జిల్లాగా అవతరించింది. అప్పటి నుంచి ప్రజలకు పాలన చేరువైంది. సాక్షి, మెదక్: ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత మెదక్ వడివడిగా అభివృద్ధి వైపు పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జిల్లా అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. దీంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసింది. జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. అలాగే కొత్తగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేశారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. జిల్లాను అధికారుల, సిబ్బంది కొరత వేధిస్తోంది. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, 157 కొత్త పంచాయతీలను కూడా ఏర్పాటు చేసింది. కాగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం మెదక్ జిల్లా ఏర్పడినా సమస్యలు మాత్రం ఎక్కడిక్కడే ఉన్నాయని విమర్శిస్తున్నాయి. యువతకు ఉపాధి కల్పన, ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం అమలులో అమలులో ప్రభుత్వం విఫలమైందని విపక్ష పార్టీలు చెబుతున్నాయి. భారీగా నిధులు .. నూతన కలెక్టరేట్‌ను రూ.60.62 కోట్లతో నిర్మిస్తున్నారు. ఆర్‌ఆండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖ ద్వారా జిల్లాలో రహదారుల, భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.300 కోట్ల నిధులు విడుదల చేసింది. రూ.47 కోట్ల వ్యయంతో బాలానగర్–నర్సాపూర్–మెదక్ జాతీయ రహదారి నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి–అకోలా జాతీయరహదారి నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మెదక్ చుట్టూరా రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మెదక్‌లో రూ.2.25 కోట్లతో ఆధునిక రైతుబజార్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మెదక్, నర్సాపూర్, తూప్రాన్‌లో మినీట్యాంక్‌బండ్‌ల నిర్మాణం సాగుతోంది. ఇటీవలే మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్ల యుడీఎస్ఎంటీ నిధులు మంజూరు చేసింది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యం వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో సాగునీటి రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రైతు పొలాలకు సాగునీరు అందించేందుకు వీలుగా ఘనపురం ఎత్తు పెంచటంతోపాటు మిషన్‌కాకతీయ ద్వారా చెరువులు, కుంటల మరమ్మతులు చేస్తున్నారు. ఘనపురం ప్రాజెక్టు ఎత్తుపెంచేందుకు రూ.100 కోట్ల నిధులు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయి. మిషన్‌కాకతీయ ద్వారా రూ.456 కోట్లతో 1893 చెరువులు, కుంటల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల భూసేకరణ జరుగుతోంది. మంజీరా నదిపై రూ.94 కోట్లతో 14 చెక్‌డ్యామ్‌లు నిర్మించనున్నారు. ప్రతిష్టాత్మకమైన కంటివెలుగు పథకానికి సీఎం కేసీఆర్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఎక్కడి పనులు అక్కడే.. కొత్త జిల్లా ఏర్పడినా.. అభివృద్ధి మాత్రం ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. నిధుల విడుదల్లో జాప్యం, పర్యవేక్షణలోపం తదితర కారణాలతో జిల్లాలో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. చాలాచోట్ల రహదారు నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో సాగని పరిస్థితి ఉంది. మిషన్‌భగీరథ పనులు కూడా పలు చోట్ల నత్తనడకన సాగుతున్నాయి. ఆగస్టు నాటికి ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఘనపురం ఆనకట్ట ఎత్తుపెంపు పనులు ముందుకు సాగడం లేదని, మిషన్ కాకతీయ పనులు ఆశించిన స్థాయిలో అమలు కాకపోవటంపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, యువతకు ఉపాధి, పరిశ్రమల ఏర్పాట్లులో ప్రభుత్వం విఫలమైందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఒక్క పరిశ్రమలేదు.. నర్సాపూర్: జిల్లా ఏర్పాటుతో సంతోషం మిగిలిందికాని ఎలాంటి అభివృద్ధి జరగకలేదు. ఇక్కడ ఉన్న పరిశ్రమలను తరలించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఒక్క పరిశ్రమ కూడ జిల్లాకు రాలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ జిల్లాకే తలమానికం కాగా ఎన్నికల్లో హామీ ఇచ్చి కొత్త జిల్లా ఏర్పడ్డాక సైతం వాటిని తెరిపించడంలో ప్రభుత్వం విఫలమైంది. జిల్లా కేంద్రంలోని అథ్లెటిక్ కేంద్రం ఇతర జిల్లాలకు తరలించారు. జిల్లా రైతులకు దక్కాల్సిన సింగూర్ జలాలు ఇతర జిల్లాకు తరలిపోయాయి. ఘనపురం ఆనకట్టకింద రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. నర్సాపూర్‌లోని పీజీ కళాశాలలో ఉన్న కోర్సులు తగ్గించారు. –ఎ మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రజలకు ఒరిగిందేమీ లేదు నర్సాపూర్: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వ శాఖలలో ఉద్యోగుల భర్తీ చేయకపోవడంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినప్పటికి డివిజన్ కేంద్రాల్లో ఉండాల్సిన ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేయలేదు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. –ఖాలెక్, సీపీఐ జిల్లా కార్యదర్శి అభివృద్ధిలో వెనుకబాటు నర్సాపూర్: కొత్త జిల్లా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అభివృద్ధిని మాత్రం పట్టించుకోలే దు. రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తానని స్వయంగా ప్రకటించినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. జిల్లా, డివిజన్, మండల ఏర్పాటులో అన్నిశాఖలలో ఉద్యోగులు ఖాళీలే దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల విభజనతో కొన్ని మండలాలు అటు ఇటుగా మారడంతో ప్రజలకు కొత్త చిక్కులు వచ్చాయి. – మాజీ ఎమ్మెల్యే సునీతారెడ్డి,డీసీసీ అధ్యక్షురాలు ప్రగతి వైపు అడుగులు నర్సాపూర్: కొత్త జిల్లా ఏర్పాటుతో జిల్లా వాసుల కల నెరవేరింది. పరిపాలన ప్రజల చెంతకు చేరింది. జిల్లా ప్రగతి వైపు పయనిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కొత్త జిల్లాలో జిల్లా కలెక్టర్, ఎస్సీ ప్రజలకు అందుబాటులో ఉండగా ప్రజల చెంతకు పరిపాలన వచ్చింది. పరిపాలనతోపాటు లాండ్ఆర్డర్ అందుబాటులో ఉంది. ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళ, పాస్బుక్కుల పంపిణీ రైతుబంధు, రైతుబీమ తదితర అభివృద్ధి కార్యక్రమాలు సులభ తరమైయ్యాయి. –మురళీధర్‌యాదవ్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు -
అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ఉట్నూర్‌రూరల్: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే షాదిముబారాక్, కల్యాణలక్ష్మి వంటి పథకాల ద్వారా నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 13 కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు ఒక్కరికి రూ.66 వేల సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి చూపుతుందని పేర్కొన్నారు. అంతే కాకుండా గ్రామస్థాయి నుంచి అభివృద్ధి పనులు చేపట్టడంలో, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విమల, జెడ్పీటీసీ జగ్జీవన్, వైస్ ఎంపీపీ సలీం, సర్పంచ్‌లు బొంత ఆశారెడ్డి, మర్సుకోల తిరుపతి, కో–ఆప్షన్ మెంబర్ ముజీబ్, తహసీల్దార్ అతీక్ ఒద్దిన్, డీటీ విశ్వనాథ్, ఎంపీటీసీ సభ్యులు అమీనబీ, శారద, కందుకూరి రమేశ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దిన్, నాయకులు షౌకత్, లతీఫ్, పంద్ర జైవంత్‌రావు, తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత దస్తురాబాద్: మండలంలోని పెర్కపల్లే గ్రామానికి చెందిన పుష్పకు మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ శుక్రవారం ఖానాపూర్లోని తన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీటీసీ వియంరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చుంచు భూమన్న తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఖానాపూర్: ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తుందని గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పెంబి మండలం మందపల్లి పంచాయతీ పరిధి నాగాపూర్ గ్రామంలో నాల్గో విడత మిషన్ కాకతీయ పథకం కింద రూ.2.50 కోట్లతో మంజూరైన రాగిచెరువు పనులను ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మిషన్ కాకతీయ పథకానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.4వేలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మందపల్లి గ్రామంలోని పల్కేరు వాగు ఎత్తు పెంచడానికి అధికారులు సర్వే చేస్తున్నారన్నారు. సరస్వతి కాలువ, ఉప కాలువలతో పాటు సదర్మాట్ బ్యారేజీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి సహకారంతో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాగి చెరువు నిధుల మంజూరుకి కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు గ్రామస్తులు మంత్రి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నల్ల శ్రీనివాస్, పెంబి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, ఎంపీటీసీ పోతురాజుల లచ్చవ్వ, ఎఫ్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్, నాయకులు గోవింద్, శేఖర్‌గౌడ్, లక్ష్మీనారాయణ, రాజవ్వ, ఈఈ రమేశ్, డీఈ శరత్‌బాబు, ఏఈఈ శ్రీనివాస్ తదితరులున్నారు. -
నెలాఖరులోగా పనులు పూర్తి
గుమ్మలక్ష్మీపురం : మండలంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె.రాజ్‌కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన గుమ్మలక్ష్మీపురం ఎంపీడీఓ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్, ఉపాధి హామీ, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులు 90 శాతం, శాఖపరమైన నిధులు పది శాతంతో గ్రామాల్లో చేపడుతున్న సీసీరోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి పనులు, గృహనిర్మాణాలు తదితర పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయి నుంచి అధికారులంతా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఆయా అభివృద్ధి పనుల కోసం నిధులను కేటాయించినందునా సంబంధిత శాఖ అధికారులు ఈ నెలాఖరుగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీటీసీ అలజంగి భాస్కరరావు, ఎంపీడీఓ ఉమామహేశ్వరి తదితరులు ఉన్నారు. -
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకం
ఐఎఫ్ఎస్ డెప్యూటీ సెక్రెటరీ సందీప్‌కుమార్‌రెడ్డి బసంత్‌నగర్: దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని భారత విదేశీ వ్యవహారాల శాఖ (ఐఎఫ్ఎస్) డెప్యూటీ సెక్రటరీ బయ్యపు సందీప్‌కుమార్‌రెడ్డి అన్నారు. తన స్వగ్రామమైన కమాన్‌పూర్ మండలం రాణాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, బసంత్‌నగర్‌లోని ఆలీవర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేశోరాం గెస్ట్‌హౌస్‌లో మాట్లాడారు. విద్య అనేది మనిషిలో విశ్వాసాన్ని పెంచుతుందని, ఇష్టంతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని, అందుకు వారి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. వ్యక్తిగత నైపుణ్యం కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చైనాలో ప్రతి ఒక్కరికి వారివారి అభీష్టం మేరకు ఆసక్తి ఉన్న రంగాలలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని, అలాంటి విధానాన్ని మన దేశంలో సైతం అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తన స్వగ్రామమైన రాణాపూర్ గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. తమ ఇంటిని గ్రామ అంగన్‌బాడీ కేంద్ర నిర్వహణకు ఇచ్చినట్లు వివరించారు. ఆయన వెంట బయ్యపు మనోహర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కొండ్ర శంకర్, బాలసాని కుమార్, తిరుపతి ఉన్నారు.