కన్నీరు పెట్టుకుంటున్న ఎమ్మెల్యే రేఖానాయక్
జన్నారం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచే తాను బరిలో ఉంటానని ఎమ్మెల్యే రేఖానాయక్ స్పష్టం చేశారు. మీ ఆశీస్సులు కావాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. చింతగూడ లక్ష్మీదేవి ఆలయంలో పూజలు చేశారు. అక్క డే ఓ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. స్థానిక మహిళలతో ఆప్యాయంగా మాట్లాడా రు. రెండుసార్లు ఆశీర్వదించినట్లుగానే వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించాలని కోరారు. 12 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తనకు ఈసారి టికెట్ ఇవ్వలేదని కన్నీరు పెట్టుకున్నారు.
దీంతో స్థానిక మహిళలు ఎమ్మెల్యేను ఓదార్చారు. తర్వాత ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం ఇటీవల ఆత్మహత్య చేసుకు న్న సీపతి రామ్మూర్తి కుటుంబాన్ని పరమార్శించా రు. అక్కడి నుంచి జన్నారం గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు. మంజూరైన అభివృద్ధి పనులు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జరిగితే తనకు పేరు వస్తుందని ఆరు నెలలుగా కొంతమంది పనులను అడ్డుకుంటుఆ్నరని ఆరోపించారు. తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే అని తెలిపారు. అనంతరం చింతలపల్లి గ్రామానికి వెళ్లి ప్రజలతో కలిసి మాట్లాడారు. అక్కడ గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట జన్నారం సర్పంచ్ గంగాధర్‌గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు సతీశ్‌కుమార్, కాంతమణి తదితరులు ఉన్నారు.
నృత్యకారులకు సన్మానం..
జిల్లా నృత్య కళాసమాఖ్య అధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలోని పీఆర్టీయూ భవన్‌లో జాతీ య స్థాయికి ఎంపికై న నటరాజ కళాక్షేత్రం విద్యార్థులు గాజుల సహాస్రగౌడ్, శ్రేణు, సంకర్ష్, వర్షిణి, తన్విక, అశ్విత, మోక్షితలను శుక్రవారం సన్మానించారు. కార్యక్రమానికి రేఖానాయక్ హాజరైన మా ట్లాడారు. జాతీయస్థాయి నృత్య పోటీలకు రాష్ట్రం నుంచి 18 మంది ఎంపిక కాగా, అందులో 8 మంది జన్నారం మండలానికి చెందినవారే కావడం గర్వకారణమన్నారు. చిన్నారుల్లోని కళలను వెలికితీసి, వారి ప్రతిభ జాతీయ స్థాయిలో చూపిస్తున్న మాస్టర్లను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా నృత్య కళాసమాఖ్య అధ్యక్షుడు రాకం సంతోష్, డ్యాన్స్ మాస్టర్లు లక్ష్మణ్, రమేశ్, నర్మదగౌడ్, నాయకులు సతీశ్‌కుమార్, కాంతామణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment