
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అరెస్ట్
ఆదిలాబాద్: మాజీ టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్ గన్ మెన్ పై దాడి ఘటనకు సంబంధించి రాథోడ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. గత మూడు రోజుల క్రితం జిల్లాలో్ని కడెం రోడ్డులోని ప్రమాద బాధితులను రేఖానాయక్ పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఆమె గన్ మెన్ పై రాథోడ్ దాడికి పాల్పడ్డాడు. దీనిపై రేఖా నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి నిర్మల్ కోర్టులో హాజరుపరిచారు.