బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో అధికారికంగా చేరిన రెండు రోజుల్లోనే రాష్ట్రీయ జనతాదళ్ (RLD) లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఆర్‌ఎల్‌డీ వెల్లడించింది.
జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్‌ఎల్‌డీ పార్టీ బిజ్నోర్ నుండి చందన్ చౌహాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ నుండి రాజ్‌కుమార్ సాంగ్వాన్‌లను పోటీకి దింపింది. 2019 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మలూక్ నగర్ బిజ్నోర్ స్థానాన్ని గెలుచుకుంది. బాగ్‌పట్ సీటును బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ గెలుచుకున్నారు. ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికలకు కూడా ఆర్‌ఎల్‌డీ అభ్యర్థిని ప్రకటించింది. యోగేష్ చౌదరిని రంగంలోకి దించింది.
ఉత్తరప్రదేశ్‌లో 51 మందితో సహా దేశవ్యాప్తంగా 195 మంది అభ్యర్థులను బీజేపీ ఆదివారం ప్రకటించింది. అత్యధికంగా 80 సీట్లు ఉండటంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏతో పాటు ప్రతిపక్ష ఇండియా కూటమికి ఉత్తరప్రదేశ్ కీలకం . జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు మరణానంతరం గత నెలలో భారతరత్న అవార్డు లభించింది. జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్‌ఎల్‌డీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో 2019లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల పొత్తుతో పోటీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 80 స్థానాలకు గానూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 64 స్థానాలను కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment