సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ రెండో జాబితాలో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఎల్లారెడ్డి, ఎల్‌బీ నగర్, మిర్యాలగూడ, వైరా, ఇల్లందు, బాన్సువాడ, తుంగతుర్తి, భువనగిరి, మక్తల్, హుస్నాబాద్, హుజూరాబాద్, భోథ్ నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ ఉంది. ఎల్‌బీ నగర్ నుంచి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి టికెట్ ఆశిస్తుండగా, హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ కీలకంగా పనిచేశారు. ఇంకా తమ టికెట్ ఖరారు కాకపోవడంపై నేతలు అసంతృప్తిలో ఉన్నారు. నేటి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మిగిలిన 64 స్థానాల్లో 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. 10 నుండి 14 అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆయా నియోజక వర్గాల్లో పోటీ తీవ్రంగా ఉండడంతో అక్కడి అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత క్లియర్ చేసే అవకాశం ఉంది. మునుగోడు, హుస్నాబాద్, పాలేరు, చెన్నూరు స్థానాల్లో వామపక్షాలు- కాంగ్రెస్ మధ్య పంచాయితీ నడుస్తోంది.
టీ.కాంగ్రెస్‌లో రెండో అభ్యర్థుల ప్రాబబుల్స్ జాబితా
►జడ్చర్ల: అనిరుధ్‌రెడ్డి\ ఎర్రశేఖర్
►మహబూబ్‌నగర్: యొన్నం శ్రీనివాస్‌రెడ్డి\ ఒబెదుల్లా కొత్వాల్
►దేవరక్రద- జి.మధుసుధన్‌రెడ్డి\కాటం ప్రదీప్‌గౌడ్
►మక్తల్: శ్రీహరి ముదిరాజ్\కొత్తకోట సిద్ధార్థ్‌రెడ్డి
►నారాయణపేట: కుంభం శివకుమార్\ఎర్ర శేఖర్
►వనపర్తి- చిన్నారెడ్డి\మేఘారెడ్డి
►దేవరకొండ-బాలు నాయక్
►భువనగిరి- కుంభం అనిల్
►సూర్యాపేట-పటేల్ రమేష్/ ఆర్.దామోదరరెడ్డి
►మిర్యాలగూడ- సీపీఎం
►మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి?
►తుంగతుర్తి- అద్ధంకి దయాకర్\ ప్రీతం\వడ్డేపల్లి రవి
►ఖమ్మం-తుమ్మల నాగేశ్వరరావు
►పాలేరు- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
►ఇల్లందు-కోరం కనకయ్య\ప్రవీణ్ నాయక్
►కొత్తగూడెం-సీపీఐ
►పినపాక-సూర్యం(సీతక్క కుమారుడు)
►అశ్వారావుపేట-తాటి వెంకటేశ్వర్లు\ సున్నం నాగమణి
►సత్తుపల్లి-సంభాని చంద్రశేఖర్‌రావు
►వైరా-బానోతు విజయాబాయి\సీపీఐ
►సిర్పూర్- రావి శ్రీనివాస్\అనిల్‌కుమార్\కృష్ణారెడ్డి
►ఆసిఫాబాద్- శ్యామ్ నాయక్\ రేణుక
►ఆదిలాబాద్- కందిశ్రీనివాస్‌రెడ్డి\ గండ్ర సుజాత
►చెన్నూర్- నల్లా ఓదెలు\ బొడ్డ జానార్థన్
►ఖానాపూర్- భరత్ చౌహాన్\రేఖానాయక్
►బోధ్- రాథోడ్ బాపురావు\ నరేష్ జాదవ్
►ముథోల్- ఆనందరావు పటేల్\పత్తిరెడ్డి విజయ్‌కుమార్
►కరీంనగర్- కొత్త జైపాల్‌రెడ్డి\రోహిత్‌రావు
►హుజూరాబాద్- బల్మూరి వెంకట్ ప్రణవ్‌బాబు
►చొప్పదండి-మేడిపల్లి సత్యం\ భానుప్రియ
►కోరుట్ల-జువ్వాడి నర్సింగరావు
►కామారెడ్డి-షబ్బీర్ అలీ
►నిజామాబాద్ అర్బన్- ధర్మపురి సంజయ్\మహేష్‌కుమార్ గౌడ్
►నిజామాబాద్ రూరల్-సుభాష్‌రెడ్డి\ భూపతిరెడ్డి నర్సారెడ్డి
►బాన్సువాడ- కాసుల బాలరాజు\ అనిల్‌కుమార్‌రెడ్డి
►ఎల్లారెడ్డి- మదన్‌మోహన్‌రావు\సుభాష్‌రెడ్డి
►జుక్కల్-గంగారాం\ తోట లక్ష్మికాంతరావు
►వరంగల్ ఈస్ట్- కొండా సురేఖ
►జనగామ- కొమ్మురి ప్రతాప్‌రెడ్డి\ టీజేఎస్ కోదండరామ్
►పరకాల- కొండా మురళి\గాజర్ల అశోక్\ ఇనిగాల వెంకట్‌రామిరెడ్డి
►డోర్నకల్-నెహ్రు నాయక్\రామ్ చంద్రనాయ్
►వరంగల్ వెస్ట్- నాయిని రాజేందర్‌రెడ్డి\ జంగా రాఘవరెడ్డి
►మహబూబాబాద్- బలరాం\ నాయక్\బెల్లయ్య నాయక్\మురళీ నాయక్
►పాలకుర్తి-జాన్సీరెడ్డి\తిరుపతిరెడ్డి
►వర్థన్నపేట-కే నాగరాజు\సిరిసిల్ల రాజయ్య
►నారాయణ్‌ఖేడ్-సురేష్ షెట్కర్\సంజీవరెడ్డి
►నర్సాపూర్-గాలి అనిల్‌కుమార్\అవుల రాజిరెడ్డి
►దుబ్బాక-చెరుకు శ్రీనివాస్‌రెడ్డి\ కత్తి కార్తీక
►పఠాన్‌చెరు-నీలం మధు\ కాట శ్రీనివాస్‌గౌడ్
►సిద్ధిపేట-పూజల హరికృష్ణ\శ్రీనివాస్‌గౌడ్, భవానిరెడ్డి
►తాండూర్-కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి-మనోహర్‌రెడ్డి
►మహేశ్వరం- పారిజిత నర్సింహారెడ్డి\ చల్లా నర్సింహారెడ్డి
►శేరిలింగంపల్లి-రఘునాథ్ యాదవ్\జగదీశ్వర్‌గౌడ్
►ఎల్‌బీ నగర్- మధుయాష్కీగౌడ్, మల్‌రెడ్డి రాంరెడ్డి
►ఇబ్రహీంపట్నం-మల్‌రెడ్డి రంగారెడ్డి
►కూకట్‌పల్లి- గొట్టిముక్కల వెంగల్‌రావు\ సత్యం శ్రీరంగం
►రాజేంద్రనగర్-జ్ఞానేశ్వర్ ముదిరాజ్\ గౌరీ సతీష్
►జూబ్లీహిల్స్- అజారుద్దీన్\విష్ణువర్థన్‌రెడ్డి
►ఖైరతాబాద్-రోహిన్‌రెడ్డి\విజయారెడ్డి
►అంబర్‌పేట- మోత రోహిత్\ నూతి శ్రీకాంత్‌గౌడ్
►చార్మినార్-అలీ మస్కతి
►కంటోన్మెంట్- వెన్నెల(గద్ధర్ కూతురు)\పిడమర్తి రవి
Comments
Please login to add a commentAdd a comment