Pawan Kalyan: పట్టుమని పది మంది అభ్యర్థులు కూడా లేరా? | Candidates Scarcity For Janasena Assembly Lok sabha Elections Pawan kalyan | Sakshi
Sakshi News home page

Pawan Kalyan: మంచి బేరం తగిలితే.. మొత్తం సీట్లు అమ్మడానికి సిద్ధమే!

Published Sun, Mar 17 2024 2:21 PM | Last Updated on Sun, Mar 17 2024 3:17 PM

Candidates Scarcity For Janasena Assembly Lok sabha Elections Pawan kalyan - Sakshi

లక్షల సంఖ్యలో పుస్తకాలు చదివిన ప్యాకేజీ స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు పార్టీ ఎలా నడపాలో తెలియదు. అసలు పార్టీ పెట్టిందే మరో పార్టీ కోసం కదా? అందుకే పదేళ్ళ పార్టీకి గ్రామసీమల్లో కార్యకర్తలే కనిపించరు. బూత్ లెవెల్ నుంచి పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో ఆయనకు తెలియదు. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎలాగొలా 21 సీట్లను తీసుకున్నారు. వాటిలో ఇప్పటికి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన సీట్లకు అభ్యర్థులు ఎక్కడున్నారు? వాటిని సరైన నేతలకు ఇస్తారా? లేక బహిరంగ వేలానికి పెడతారా? అసలు పవన్‌ ఆలోచన ఏంటి?..

జనసేన అధినేత పవన్‌కు ప్యాకేజీ స్టార్‌ పేరు బాగా సూటయింది. ఆయన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా..ప్రజల అభిప్రాయం అదే. పార్టీ స్థాపించి పదేళ్ళయినా  సంస్థాగత నిర్మాణం అంటే ఏంటో ఆయనకు తెలియడంలేదు. కాని సినిమాల్లో మాదిరిగా స్టేజీ మీద ఊగిపోతూ..గంగవెర్రులెత్తుతున్నట్లుగా ప్రసంగాలు చేసి సభికులకు ఆహ్లాదం పంచుతున్నారు. పార్టీ స్థాపించింది తన కోసం..తన వారి కోసం కాదని అందరికీ తెలుసు. చంద్రబాబును మోయడానికే పార్టీ పెట్టారు. పదేళ్ళ తర్వాత కూడా మోయడం కొనసాగిస్తున్నారు. అందుకే ఆయన ఎన్ని సీట్లు ఇచ్చిన మహాప్రసాదం అని తీసుకుంటున్నారు. మొత్తానికి 21 సీట్లు పవన్‌కు విసిరేశారు చంద్రబాబు. మరి సీట్లన్నిటికీ అభ్యర్థులున్నారా? వారిని ఎలా ఎంపిక చేస్తున్నారు?.
చదవండి: తేలు కుట్టిన దొంగ రామోజీ

పవన్ కల్యాణ్ సభలు నిర్వహించేప్పుడు ఆయనతో పాటు వేదిక మీద కూర్చోడానికి నాదెండ్ల మనోహర్ తప్ప మరో నాయకుడు కనిపించరు. ఆయన వద్ద పట్టుమని పది మంది అభ్యర్థులు కూడా సిద్ధంగా లేరనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే.. తొలిజాబితా అనే పేరుతో  ఐదుగురి పేర్లను, తర్వాత మరొక పేరును పవన్ ప్రకటించారు. మిగిలిన స్థానాలకు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు. ఈలోగా.. ఏ పార్టీనుంచి ఎవరు వచ్చి తమ పార్టీలో చేరుతారా? అని ఎదురుచూస్తూ గడుపుతున్నారు.

ప్రకటించిన ఆరు సీట్లలో కూడా కొణతల రామకృష్ణ కొన్ని వారాల కిందటే పార్టీలో చేరిన వ్యక్తి. తాజాగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనకు రెండు ఎంపీ సీట్లు దక్కగా మచిలీపట్నం సీటును కొత్తగా పార్టీలో చేరిన వల్లభనేని బాలశౌరికి ఇస్తున్నారు. ఒకటీ అరా తప్ప జనసేనకు దక్కిన సీట్లన్నీ జస్ట్ ఇప్పుడే పార్టీలో చేరుతున్న వారికే దక్కుతున్నాయి. సీటు కన్ఫర్మేషన్ తర్వాతనే.. ఉన్న పార్టీని వదలి జనసేనలో చేరుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. 

జనసేన పార్టీకి అసలు సొంతంగా ఎమ్మెల్యేగా పోటీచేయగల నాయకుల కొరత బాగా ఉంది. అందుకే సీట్ల సంఖ్య తేల్చుకున్న తర్వాత.. పవన్ కల్యాణ్ వాటిని అమ్మకానికి పెడుతున్నారనే టాక్ నడుస్తోంది. దీన్ని పార్టీ దుస్థితి అనాలో.. పవన్ కల్యాణ్‌లోని వ్యాపార మెళకువ అనాలో తెలియడంలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఆయన అలవాటు మాత్రం సీట్లను బేరం పెట్టుకోవడమే.

తెలంగాణలో బీజేపీతో కలిసి ఎనిమిది సీట్లు దక్కించుకున్న పవన్‌కు ఆయా స్థానాల్లో పోటీ చేయించేందుకు కూడా అభ్యర్థులు లేక..సగానికి పైగా అప్పటికప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి వాటిని అమ్ముకున్నారు. ఇప్పుడు ఏపీలో ఆయనకు దక్కింది 21 కాగా.. ఆరు చోట్ల అభ్యర్థులను నిర్ణయించగా, మిగిలిన 15 సీట్లను బేరానికి పెట్టారు.

పవన్ కల్యాణ్ ఒక స్థానంలో పోటీచేస్తారు కదా అనుకోవచ్చు. అదేం లేదు.. మంచి బేరం తగిలితే.. మొత్తం 15 టికెట్లను కూడా అమ్మడానికి ఆయన సిద్ధమే అని ఆయన గురించి తెలిసినవారు అభిప్రాయపడుతున్నారు. రెండు ఎంపీ సీట్లలో ఒకటి వల్లభనేని బాలశౌరి బేరానికి ఇచ్చేసిన పవన్.. కాకినాడలో తానే ఎంపీగా పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎటూ ఏపీలో ఈ కూటమి గెలిచేది లేదు.. ఎంపీగా నెగ్గితే సెంటర్లో మంత్రి కావచ్చని ఆయన ఆశపడుతున్నారు. అందువల్ల.. మంచి బేరం దొరికితే.. తనకోసం ఒక్కటి కూడా ఉంచుకోకుండా మొత్తం 15 ఎమ్మెల్యే సీట్లను కొత్తగా వచ్చేవారికి అమ్మేస్తారని అనుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి, డబ్బు సంచులతో వచ్చేవారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారనే టాక్ బాగా నడుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement