సామాజిక న్యాయానికి అల్లంత దూరంలో టీడీపీ
అభ్యర్థుల జాబితాలో బీసీలకు హ్యాండ్
చంద్రబాబు తీరుపై బీసీ సంఘాల నేతల మండిపాటు
బీసీలు అధికంగా ఉన్న స్థానాలు సైతం.. సొంత సామాజిక వర్గానికే కేటాయించుకున్న బాబు
బాబుపై రగిలిపోతూ ఆందోళనలు చేపట్టిన బీసీ సంఘాలు
బీసీలకు సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్‌పై సర్వత్రా ప్రశంసలు
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. దేశానికి బ్యాక్ బోన్ క్లాస్ అని మొదటి నుంచి చెబుతున్న సీఎం జగన్
సీఎం జగన్ నినాదాన్నే.. బీసీ డిక్లరేషన్‌లో కాపీ కొట్టిన టీడీపీ-జనసేన
టికెట్ల కేటాయింపులో మాత్రం బీసీలకు ద్రోహం చేసిన బాబు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఒకప్పుడు.. సామాజిక న్యాయం అంటే చంద్రబాబు దృష్టిలో ఎన్నికలప్పుడు వాడుకోవడం.. అధికారంలోకి వచ్చాక వదిలేయడంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఎన్నికల సమయంలోనూ ఆ అంశాన్ని ప్రతిపక్ష నేత పూర్తిగా విస్మరించినట్లున్నారు!. తాజాగా.. టీడీపీ ప్రకటించిన మూడు జాబితాలను చూసి బీసీ సంఘాలు చంద్రబాబుపై రగిలిపోతున్నాయి.
ఈ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేవలం 4 ఎంపీ, 31 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. అదే అధికార వైఎస్సార్‌సీపీ గత ఎన్నికలకు మించి బీసీలకు ప్రాధాన్యమిచ్చింది. అసెంబ్లీ, లోక్‌సభ కలిపి 59 స్థానాలను ఆ వర్గాలకు(ఏకంగా 11 లోక్ సభ.. 48 అసెంబ్లీ) కేటాయించారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్‌మోహన్‌రెడ్డి. దీంతో.. ప్రతిపక్ష నేత తీరుపై బీసీ నేతలు రగిలిపోతున్నారు. బీసీ డిక్లరేషన్ అంటూ బిల్డప్‌లు ఇచ్చి.. తక్కువ సీట్లు ఇచ్చి బీసీల గొంతు కోశారని మండిపడుతున్నారు.
జనరంజకమైన జాబితా అంటూ చంద్రబాబు గప్పాలు కొట్టుకుంటున్నప్పటికీ.. సీట్ల కేటాయింపులో డబ్బుకి ప్రాధాన్యం, కుల పక్షపాతం లాంటివి కనిపిస్తున్నాయని అంటున్నారు వాళ్లు. ఆఖరికి బీసీలు అధికంగా విశాఖ, నరసరావుపేట, గుంటూరు సీట్లను కూడా తన సామాజిక వర్గానికి ఇచ్చుకొవడాన్ని బీసీ నేతలు సహించలేకపోతున్నారు. ఇప్పటికే మంగళగిరి విషయంలో బీసీలకు కాకుండా.. మళ్లీ తన తనయుడు నారా లోకేష్‌కే టికెట్ ఇవ్వడంపై బీసీలు అసంతృప్తితో రగిలిపోతున్న సంగత తెలిసిందే.
చంద్రబాబుకి నిరసనగా.. బీసీ సంఘాల నేతలు పలువురు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయిప్పుడు. ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు ఇచ్చిన చంద్రబాబును తిడుతూనే.. సామాజిక న్యాయం పేరిట బీసీలకు పెద్ద పీట వేసిన సీఎం జగన్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఇదీ చదవండి: YSRCP.. జయహో బీసీ
‘‘మీ ధైర్యాన్ని ఎప్పుడూ కూడా నేను మెచ్చుకుంటాను. జగన్‌మోహన్ రెడ్డి గారు మీ పార్టీ గురించి మేము ఎప్పుడైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. పార్టీ గురించి తప్ప మీ మీద ఎప్పుడూ నాకు వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు’’.. చంద్రబాబు చేతిలో మోసపోయిన ఏలూరు టీడీపీ పార్లమెంటరీ ఇంఛార్జి గోపాల్ యాదవ్ సీఎం జగన్‌ను మెచ్చుకుంటూ విడుదల చేసిన వీడియో సారాంశం ఇది. ఏలూరులో పార్టీ కోసం పని చేసిన వాళ్ళను పక్కన పెట్టి చంద్రబాబు పుట్ట మహేష్ యాదవ్ కి ఇవ్వడంపై గోపాల్ యాదవ్ ఈ సందర్భంగా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment