సాక్షి, ఢిల్లీ: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి జాబితాలో ఖరారైన అభ్యర్థులలో ముగ్గురు సీనియర్ నేతలు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. జాబితాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాంతోనే విడుదలలో జాప్యం నెలకొందనే చర్చ జరుగుతోంది.
తాండూరు స్థానంలో కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ఖరారు కాగా, ఆయన పోటీకి ససేమిరా అంటున్నట్లు సమాచారం. ధర్మపురిలో పోటీ చేస్తానంటున్న వివేక్ పేరును చెన్నూరు నుంచి లిస్ట్‌లో నాయకత్వం పెట్టినట్లు తెలిసింది. నిజామాబాద్ రూరల్ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్న యెండల లక్ష్మీనారాయణను బోధన్ నుంచి పోటీ చేయించాలని ఎంపీ అరవింద్ పట్టుపడుతున్నట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి.
గోషామహాల్ నుంచి కాకుండా ఎంఐఎం పోటీ చేసే స్థానంలో రాజాసింగ్‌ను పోటీ చేయించాలనే ఆలోచనలో నాయకత్వం ఉన్నట్లు సమాచారం. కార్వాన్ లేదా మలక్‌పేట్ స్థానంలో రాజాసింగ్‌ను పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. స్థానాలు మార్పుపై క్లారిటీ వచ్చాకే తొలి జాబితా విడుదలయే అవకాశం ఉంది.
చదవండి: దసరా తర్వాతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. సీపీఐకి ఎదురుదెబ్బ!
Comments
Please login to add a commentAdd a comment