దాదర్: హోరాహోరీగా సాగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రచారం ప్రశాంతంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 158 ప్రధాన, ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 4,136 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 2,050 మంది బరిలో ఉండగా మిగతా 2,086 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. అలాగే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న రాందాస్ అథవలే నేతృత్వంలోని ఆర్పీఐకి చెందిన 31 మంది అభ్యర్థులున్నారు.
దీన్ని బట్టి వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకంటే ఇండిపెండెంట్లే అధికంగా బరిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి మొదటి స్థానంలో మాయావతికి చెందిన బీఎస్పీ, రెండో స్థానంలో ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వం వహిస్తున్న వంచిత్ బహుజన్ అఘాడీ, మూడో స్థానంలో బీజేపీ ఉంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (ఏపీ) తదితర ప్రాంతీయ పారీ్టలున్నాయి. మొత్తం 4,136 మంది అభ్యర్థుల్లో ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగా ఉండటంతో ఓట్లు చీలిపోతాయే భయం ప్రధాన రాజకీయ పారీ్టల అభ్యర్థులకు పట్టుకుంది. ఈ సారి జనాలు ఎప్పుడు పేరు వినని పారీ్టలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపడం గమనార్హం. మొత్తం 288 స్థానాలకు ఈ నెల 20వ తేదీన ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎవరిని అదృష్టం వరిస్తుంది? ఏ పారీ్టకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది? ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది? అనేది ఈనెల 23వ తేదీన వెలువడే ఫలితాల్లో స్పష్టం కానుంది.
ఎప్పుడూ పేరు వినని పార్టీలు
వికాస్ ఇండియా పార్టీ, ఎల్ఘార్ పార్టీ, వీర్ జనశక్తి పార్టీ, సన్మాన్ రాజకీయ పార్టీ, సర్దార్ వల్లభాయి పార్టీ, సంపూర్ణ భారత్ క్రాంతి పార్టీ, నేతాజీ కాంగ్రెస్ పార్టీ, నిర్భయ్ మహారాష్ట్ర పార్టీ, ఓపెన్ పీపుల్స్ పార్టీ, నేషనల్ వరల్డ్ లీడర్ పార్టీ, జయ్ హింద్ జయ్ భారత్ రా్రïÙ్టయ పార్టీ, ఇండియన్ పాలిటికల్ కాంగ్రెస్ పార్టీ, విందు«థలాయి చిరుతెంగల్ పార్టీ, ఎం పాలిటికల్ పార్టీ, భారత్ జోడో పార్టీ ఉన్నాయి.
పది మంది కంటే ఎక్కువ అభ్యర్థుల పోటీ
పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్)–44, మహారాష్ట్ర స్వరాజ్య పార్టీ–32, రైట్ టూ రీకాల్ పార్టీ–18, సంభాజీ బ్రిగేడ్ పార్టీ–19, ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇంక్విలాబ్ ఏ మిలాత్–16, జనహిత్ లోక్‌షాహీపార్టీ–18, బహుజన్ మహాపార్టీ–11, భారతీయ యువ జన్‌ఏక్తా పార్టీ–12, దేశ్ జనహిత్ పారీ్ట–11, జన్ జనవాదీ పార్టీ–13, రాష్ట్రీయ స్వరాజ్య సేనా–15, వికాస్ ఇండియా పార్టీ–11.
అత్యధిక, అతి తక్కువ అభ్యర్థులు పోటీ చేస్తున్న జిల్లాలు
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో ముంబై, ఉప నగర జిల్లాల్లో అత్యధికంగా అంటే 315 మంది, పుణేలో 303 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే అతి తక్కువ అంటే 17 మంది అభ్యర్థులు సింధుదుర్గ్ జిల్లాలో పోటీ చేస్తున్నారు. అలాగే మొత్తం మహిళా అభ్యర్థుల సంఖ్య 363 ఉండగా ఇందులో కూడా ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగా ఉంది. కాగా, మొత్తం 363 మంది మహిళా అభ్యర్థులున్నప్పటికీ ఇందులో ముంబై, ఉప నగరజిల్లాల్లో అత్యధికంగా అంటే 39 మంది బరిలో ఉన్నారు. హింగోళీ, రత్నగిరి జిల్లాలో అతి తక్కువ అంటే ఇద్దరు చొప్పున బరిలో ఉన్నారు. జల్గావ్, నాందేడ్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున హిజ్రా అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికి ఎన్ని ఓట్లు పోలవుతాయనే దానిపై అందరి దృష్టి ఉంది.
పార్టీల వారీగా అభ్యర్థుల సంఖ్య
బీజేపీ–149, కాంగ్రెస్–101, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)–86, శివసేన (శిందే వర్గం)–81, యూబీటీ (శివసేన)–95, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం)–59, బహుజన్ సమాజ్ పార్టీ–259, వంచిత్ బహుజన్ అఘాడీ–200, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)–125, రాష్ట్రీయ సమాజ్ పార్టీ–93, ఆర్పీఐ (అథవలే వర్గం)–31, ప్రహార్ జనశక్తి–38, ఆజాద్ సమాజ్ పార్టీ–28, రిపబ్లికన్ సేనా–21, బహుజన్ రిపబ్లికన్ స్పెషలిస్టు పార్టీ–22,స్వాభిమాన్ పార్టీ–19, పీడబ్ల్యూపీ–18, ఎంఐఎం–17, భీంసేనా–14, లోక్‌రాజ్య పార్టీ–10, జనసురాజ్య శక్తి–6, సమాజ్‌వాదీ పార్టీ–9, సమతా పార్టీ–9, రాష్ట్రీయ గోండ్వానా పార్టీ–4, జనతాదళ్ (సెక్యులర్)–4, మార్క్స్‌వాదీ కమ్యూనిస్టు పార్టీ–3.
Comments
Please login to add a commentAdd a comment