మది నచ్చేలా ఉండాలి.. మేనికి హాయినివ్వాలి.. తరాల జ్ఞాపకమై కదలాలి.. పర్యావరణానికి హితమై.. తరుణులకు నెచ్చెలి అయి.. నిలిచేలా ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. సస్టెయినబుల్ ఫ్యాషన్.. ప్రపంచంలో చమురు తర్వాత ఫ్యాబ్రిక్ పరిశ్రమయే అతి పెద్దది.
చమురు ప్రపంచవ్యాప్తంగా ..10 శాతం కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. దీనితో పోల్చితే పాలిస్టర్‌తో తయారయ్యే ఫాస్ట్ ఫ్యాషన్ వల్ల పర్యావరణం విపరీతంగా కలుషితం అవుతుందనేది నిపుణుల మాట. ఇలాంటప్పుడు ఫ్యాషన్‌లో మనవైన ఫ్యాబ్రిక్‌ను ఉపయోగిద్దాం.. పర్యావరణానికి నేస్తాలుగా మారుదాం.
యువత నుంచే..
మన విద్యా విధానంలో ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ వాడకానికి సంబంధించిన విషయాలు చెప్పడం ప్రారంభిస్తే పిల్లలు, యువతకు వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడంలోనూ ఉపయోగపడుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాఠ్యాంశాల్లో సస్టెయినబుల్ ఫ్యాషన్‌కు సంబంధించిన పాఠాన్ని చేర్చాలని పర్యావరణ అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాడిన ఉత్పత్తులను తిరిగి ఉపయోగించడం, వాడిన వస్తువులను రీ సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరించబడుతుంది.
మైండ్ ‘సెట్’
ఫ్యాషన్ వ్యవస్థలో పరివర్తనకు కీలకమైన మార్పులు తీసుకువస్తున్నాయి కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్. లండన్ ఫ్యాషన్ స్కూల్ ‘యుఎఎల్’ సస్టెయినబుల్ ఫ్యాబ్రిక్ డిజైనింగ్ కోసం ప్రత్యేకంగా కోర్సులను ఆఫర్ చేస్తోంది. యూనివర్శిటీ స్థాయిలో ఫ్యాషన్ విద్య అనేది కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి, వాతావరణం, సామాజిక, న్యాయసూత్రాలను అమలు చేయడానికి వీలైనదని, యువతలో ‘మైండ్‌సెట్’ చేయడానికి ఈ విధానం బాగా ఉపకరిస్తుందని చెబుతోంది.
ఇప్పటికే నిలకడ లేని ఫాస్ట్ ఫ్యాషన్ పద్ధతులు పర్యావరణాన్ని విపరీతంగా నాశనం చేశాయంటోంది న్యూయార్క్ ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వంతో కలిసి పని చేసిన మొట్టమొదటి ఉన్నత విద్యాసంస్థలలో ఒకటిగా నిలిచింది ఎన్‌ఎఫ్‌ఇఎటి. 2011లో కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గించిన ఈ సంస్థ, 2016 నాటికి 46 శాతానికి తగ్గించింది. 2025 నాటికి 50 శాతానికి చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.
మన దేశంలోనూ
హ్యండ్లూమ్స్‌తో యువత కోరుకునేవిధంగా డ్రెస్ డిజైన్ చేసే సంస్థలు ఉన్నాయి. ఫాస్ట్‌ఫ్యాషన్ పోకడలను నిలువరించి, స్వదేశీ నాణ్యమైన, పర్యావరణ హితమైన ఫ్యాబ్రిక్ డిజైన్స్ వైపు దృష్టి పెట్టాల్సిన అత్యవసర తరుణంగా ఈ యేడాది నిర్ణయం తీసుకుందాం.
మనవైన చేనేతలు ఎవర్‌గ్రీన్‌గా ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాయి. ఇండో–వెస్ట్రన్ మార్కులూ కొట్టేస్తుంటాయి. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్‌ని బ్లాక్ ప్రింట్, టై అండ్ డై డిజైన్స్‌తో మెరిపించినా, చేతితో అల్లిన ఊలు శాలువాలు, జాకెట్స్ కానుకలుగా ఇచ్చినా అవి జ్ఞాపకాల దొంతరగా మనల్ని హత్తుకుపోతాయి.
పునరుద్ధరణ
ఉపయోగించని చీరలు, దుపట్టాలు చిన్నారుల సంప్రదాయ డ్రెస్‌లకు సరిగ్గా నప్పుతాయి. వేటిని తిరిగి ఉపయోగించవచ్చో తెలుసుకొని ఆచరణలో పెట్టినా ప్రకృతికి ఎంతో మేలు.
చదవండి: Megha Akash: తారలా తళుకులీనుతున్న మేఘా ఆకాశ్.. ఈ ట్రెండీ లుక్‌కు కారణం?
Comments
Please login to add a commentAdd a comment