న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ఆదివారం(నవంబర్ 3) ఉదయం ఐదు గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 500 పాయింట్లుగా నమోదై కాలుష్య తీవ్రత రికార్డు స్థాయికి వెళ్లింది. కాలుష్యానికి తోడు ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఏక్యూఐ 507 పాయింట్లకు చేరితే ప్రమాదకర స్థాయి కాలుష్యంగా పరిగణిస్తారు. ఈ గాలి పీల్చితే ప్రజలకు శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏక్యూఐ 500 పాయింట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి 65 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అయితే శనివారం రాత్రి 9 గంటలకు 327గా ఉన్న ఏక్యూఐ కేవలం 12 గంటల్లో ఆదివారం ఉదయానికల్లా 500 పాయింట్లు దాటడం ఢిల్లీ వాసులను కలవరపరుస్తోంది.
ఇదీ చదవండి: విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్
Comments
Please login to add a commentAdd a comment