గుండెజబ్బుల ముప్పులో శిశువులు
గుండెజబ్బుల ముప్పులో శిశువులు
Published Mon, Aug 8 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
విజయవాడ (లబ్బీపేట) :
భారత్‌లో పుట్టుకతో గుండెలోపాలతో పుడుతున్న చిన్నారులు రోజు రోజుకు పెరుగుతున్నారని ఇంగ్లండ్‌లో పీడియాట్రిక్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుముల అన్నారు. ఆంధ్రా హాస్పటల్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ఏపీ, కృష్ణాజిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పిల్లల్లో గుండెలోపాలను గుర్తించడం ఎలా అనే అంశంపై కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్(సీఎంఇ) ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సీఎంఈకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 200ల మందికిపైగా పిల్లల వైద్య నిపుణులు హాజరయ్యారు. ఈ సదస్సును తొలుత ఏపీ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ యలమంచిలి రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ పిల్లల్లో గుండెలోపాలు, వాటిని ఎలా గుర్తించాలనే అంశంపై విశ్లేషణాత్మకంగా వివరించారు. ఇంటర్వెన్షనల్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ మిర్జన వెట్‌కోవిక్ , డాక్టర్ నయన్ షెట్టీ, డాక్టర్ ప్రేమ్‌సుందర్ వేణుగోపాల్, డాక్టర్ పీవీ రామారావు, డాక్టర్ శ్రీమన్నారాయణ, కార్డియో డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement