బతుకు పోరు
మన ఊరు కాదు, జిల్లా కాదు, ఆ మటకొస్తే మన రాష్ట్రం కూడా కాదు.. ఎక్కడో అసోం, బీహార్ నుంచి వందలు, వేల కిలోమీటర్లు దాటి వచ్చిన వంద మందికిపైగా యువకులు పొట్టకూటి కోసం ఇదిగో ఇలా విద్యుత్ స్తంభాలపై బతుకుపోరాటం చేస్తున్నారు. సోమవారం కర్నూలు నగరంలో 11000 కేవీ విద్యుత్ లైన్‌కు కవర్డ్ కేబుల్ మార్చే పనుల్లో నిమగ్నమై ఉండగా సాక్షి తీసిన చిత్రమిది. ప్రమాదమని తెలిసినా ఇలా ఎత్తయిన విద్యుత్ స్తంభాలపై కూర్చొని బరువైన కేబుల్‌ను అమరుస్తూ వీళ్లు చేసే పనులు చూసినోళ్ల ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది.
- డీ హుసేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు