'మహిళలకు దేవాలయ ప్రవేశం' అనే అంశంపై దేశంలో చర్చ జరుగుతున్న తరుణంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళ అనే కారణంగా ఆలయాల్లోకి అనుమతి నిరాకరించడం, లింగం ఆధారంగా వివక్షచూపడం ప్రమాదకరమని అభిప్రాయపడింది.
లింగ ఆధారిత న్యాయం ప్రమాదకరం
Published Mon, Apr 11 2016 6:40 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
న్యూఢిల్లీ: 'మహిళలకు దేవాలయ ప్రవేశం' అనే అంశంపై దేశంలో చర్చ జరుగుతున్న తరుణంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళ అనే కారణంగా ఆలయాల్లోకి అనుమతి నిరాకరించడం, లింగం ఆధారంగా వివక్షచూపడం ప్రమాదకరమని అభిప్రాయపడింది.
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి గర్భగుడిలోకి ప్రవేశాన్ని కోరుతూ వేసిన పిటిషన్ ను విచారిస్తూ న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ వాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో ఎక్కడా మహిళ అనే కారణంగా గర్భగుడిలోకి వెళ్లకూడదని లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సాంప్రదాయాల పేరుతో అనుమతి నిరాకరించడం సహేతుకం కాదని అన్నారు. ఒక నాడు సతీసహగమనం, వరకట్నం వంటివి కూడా సాంప్రదాయంలో భాగంగా ఉండేవని వాటిని నిషేధించిన విషయాన్ని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. బ్రహ్మచారి, యోగి అయిన అయ్యప్ప దేవాలయంలో్కి రుతుక్రమంలో ఉన్న మహిళలు వస్తే ఆలయ పవిత్రత దెబ్బతింటుందనే సాంప్రదాయం కొనసాగుతోంది.
Advertisement
Advertisement