చిలకలూరిపేట:
హైదరాబాద్ వంటి మహా నగరాల్లో జరిగే బైక్, కారు రేసింగ్‌లు గుంటూరు జిల్లాలోనూ కనిపిస్తున్నా యి. ప్రాణాంతకంగా మారిన ఈ పందాలు ప్రజల్లోనూ భయాందోళనలు రేపుతున్నాయి. అతి వేగంగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువతరం తమ బంగరు భవితను కోల్పోతున్నారు.
పందాల సందర్భంగా జరుగుతున్న ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు గాయాలపాలై వికలాంగులుగా మారుతు న్నారు. ఆదివారం యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన కారు రేసింగ్‌ను చూసిన ప్రజలే భయాందోళనకు గురయ్యారంటే వాహనాల వేగం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
ఎప్పుడు రద్దీగా ఉండే 16వ నంబరు జాతీయ రహదారిపై తిమ్మాపురం పరిధిలో ఆది వారం కొంతమేర ట్రాఫిక్ తక్కువగానే ఉంది. విద్యాసంస్థలకు సెలవు కావడం, వాహన రాకపోకలు పెద్దగా లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్టయింది.
జాతీయ రహదారి విస్తరణ కూడా వాహనాల వేగం పెరగటానికి కారణమైంది. గతంలో నాలుగు లేన్లగా ఉన్న జాతీయరహదారిని ఆరు లేన్లగా విస్తరించిన క్రమంలో వాహనాలు అతి వేగంతో దూసుకువెళుతున్నాయి.
ఆదివారం జరిగిన కారు రేస్‌లో ముందుగా విద్యార్థులు నిర్ణయించుకున్న టార్గెట్‌కు సమీప దూరంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
విజయవాడ నుంచి రెండు కారుల్లో వస్తున్న విద్యార్థులు గుంటూరు నగరం దాటిన తరు వాతే రేస్ ఆడాలని ప్లాన్ చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.
కారు రేసులో ప్రమాదానికి గురైన గురైన ఏపీ 37 బీఏ 4646 వాహనం ఏలూరుకు చెందిన వ్యక్తి పేరుపై, మరో వాహనం ఏపీ31 సీపీ 0999 వాహనం విశాఖపట్నానికి చెందిన వ్యక్తిపేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్టు సమాచారం.
ప్రమాదం జరిగిన సమయంలో కారుల వేగం 140 కిలోమీటర్ల పైగా ఉండి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి.
అతి వేగమే... రేసింగ్ కాదు : పోలీసులు తిమ్మాపురం సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదం అతివేగం వల్ల జరిగిందేనని కారుల రేస్ కాదని పోలీసులు అంటున్నారు. ఈ విషయంపై రూరల్ సీఐ సంజీవ్‌కుమార్ మాట్లాడు తూ ఎంతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై కారుల రేస్ జరిగే అవకాశమే లేదన్నారు. ఓవర్ టేక్ చేసే సమయంలో జరిగిన ప్రమాదంగా ఆయన అభివర్ణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రేసింగ్ యమ డేంజర్
Published Mon, Oct 27 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM
Advertisement
Advertisement