అమెరికా ట్రేడ్ రిప్రెజెంటేటివ్ అధికారి గ్రెగోరీ డౌడ్
వాషింగ్టన్: ‘భారత ప్రభుత్వం వరి, గోధుమలు పండించే రైతులకు భారీగా రాయితీలు ఇస్తోంది. భారత్ చేపట్టిన ఈ వర్తక వక్రీకరణ విధానంపై ఇతర దేశాలు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది’ అని అమెరికా వ్యాఖ్యానించింది. ‘ప్రపంచవ్యాప్తంగా వరి, గోధుమ పండించే ప్రతి దేశానికీ భారత్ వర్తక ప్రభావం ఆందోళనకరమే. ఈ ధాన్యాలను ఉత్పత్తి చేసే ఇతర దేశాలకు నష్టం కలిగించేలా భారత్ దేశీయ మద్దతు విధానాన్ని అమలు చేస్తోంది’ అని అమెరికా ట్రేడ్ రిప్రెజెంటేటివ్ అధికారి గ్రెగోరీ డౌడ్ ఆరోపించారు. ‘2010 నుంచి 2014 మధ్య వరి ఉత్పత్తి వ్యయాన్ని 74 శాతం నుంచి 84.2 శాతానికి భారత్ పెంచింది. అలాగే గోధుమల ఉత్పత్తి వ్యయాన్ని 60 శాతం నుంచి 68.5 శాతానికి పెంచింది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment