మైండ్‌ను దొంగిలించే రోజులొస్తున్నాయి?
జెనీవా: మన మదిలో చెలరేగే ఆలోచనల్ని, భావాల్ని ఇతరులు తెలుసుకోగల, మార్చగల, దొంగిలించగల రోజులు రాబోతున్నాయి. ‘మైండ్ రీడింగ్ టెక్నాలజీ’తో పరిశోధకులు దాన్ని సుసాధ్యం చేయబోతున్నారు. మెదడు పనితీరును శాస్త్రీయంగా డీకోడ్ చేయడం ద్వారా ఇది సాధ్యం కానుంది. ఈ విషయాన్ని ‘సైంటిఫిక్ అమెరికా’ అనే మేగజీన్ ప్రచురించింది.
అయితే, ఈ మైండ్ రీడింగ్ టెక్నాలజీ వాస్తవరూపం దాలిస్తే.. మానవాళికి పెనుముప్పని మరో వర్గం శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన ఆలోచనలను ఇతరులు నియంత్రించడం జరిగితే ఎదురయ్యే అనర్ధాలను అంచనా కూడా వేయలేమంటున్నారు. అందువల్ల ఇప్పటినుంచే మానవహక్కులకు సంబంధించిన కొత్త చట్టాలను రూపొందించాలని స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వర్సిటీ చెందిన శాస్త్రవేత్త మార్సిలో ఐనెకా కోరుతున్నారు.