
ఒక బైకు.. ఏడుగురు ప్రయాణికులు..
అందులోనూ చిన్న పిల్లలు, మహిళలు ఉంటున్నారు. రోడ్లపై ప్రయాణించే సమయంలో ఎదురుగా ఏదైనా వాహనాలు వచ్చినా, ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పెను ప్రమాదంతో భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఇలా ప్రయాణించే వారికి ట్రాఫిక్ నిబంధనలపై ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రమాదం జరిగినప్పుడు అయ్యో పాపం అని చేతులు దులుపుకోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు.