కృత్రిమ పాల తయారీ కేంద్రాలపై బుధవారం అధికారులు దాడులు చేపట్టారు.
గుంటూరు: కృత్రిమ పాల తయారీ కేంద్రాలపై బుధవారం అధికారులు దాడులు చేపట్టారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం అల్లూరి వారిపాలెంలో కత్రిమ పాలు తయారీ కేంద్రంపై ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో కృత్రిమ పాల తయారీకి ఉపయోగించే 160 లీటర్ల రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తయారీ దారులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(నర్సరావుపేట రూరల్)