ప్రమాదవశాత్తు గణేశుని విగ్రహం పడిపోవటంతో దాని కిందపడి ఒక వ్యక్తి మృతి చెందాడు.
ప్రమాదవశాత్తు గణేశుని విగ్రహం పడిపోవటంతో దాని కిందపడి ఒక వ్యక్తి మృతి చెందాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో గురువారం వేకువజామున ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేసేందుకు బుధవారం రాత్రి గ్రామస్తులు బయలుదేరారు. అదేమార్గంలోని కృష్ణాయపాలెం గ్రామం గుండా వెళ్తుండగా ట్రాక్టర్‌పై ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి కిందపడిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఎర్రబాలెం గ్రామానికి చెందిన పోకల శంకర్‌రావు(42) దాని కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శంకర్‌రావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.