గణే శుని విగ్రహ నిమజ్జనానికి వెళ్లిన ఒక వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా చాకలిపేటలో బుధవారం అర్థరాత్రి జరిగింది.
గణే శుని విగ్రహ నిమజ్జనానికి వెళ్లిన ఒక వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా చాకలిపేటలో బుధవారం అర్థరాత్రి జరిగింది. విజయనగరం జిల్లా కేంద్రం నాగోజీపేటకు చెందిన గేదెల పైడిరాజు చాకలిపేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనం కార్యక్రమానికి వెళ్లాడు. చెరువులోకి దిగి విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో పట్టుతప్పి.. నీళ్లలోకి జారిపోయాడు. బురద మట్టిలో కూరుకుపోయి తిరిగి పైకి రాలేక ప్రాణాలు విడిచాడు. నిమజ్జనం అనంతరం అందరూ తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. అతడు తిరిగి రాని విషయం గమనించిన కుటుంబసభ్యులు, గ్రామస్తులతో వెళ్లి చెరువులో వెదకగా బురదలో విగతజీవిగా కనిపించాడు.