నిమజ్జనానికి వెళ్లి బాలుడి మృతి
వినుకొండ రూరల్: మండలంలోని ఎ.కొత్తపాలెం సమీపంలోని గుండ్లకమ్మలో మంగళవారం నిమజ్జనానికి వెళ్లి ఓ బాలుడు మతిచెందాడు. మండలంలోని ఎ.కొత్తపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు గ్రామానికి చెందిన రాయని చిన్న ఆంజనేయులు, రమణమ్మలకు మూడో కుమారుడు సాయి(12) ఇంట్లో పూజించిన విగ్రహాన్ని ఉదయాన్నే నిమజ్జనం చేసేందుకు ఇంటి సమీపంలోని గుండ్లకమ్మ వద్దకు చేరాడు. బొమ్మను నీటిలో వదలాలనే ఉద్దేశంతో గుండ్లకమ్మలోకి దిగాడు. ఇసుక కోసం తీసిన గుంతలో చిక్కుకుని ఊపిరి ఆడక మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు సాయి ఆచూకీ కోసం గాలించగా శవమై కనిపించాడు. సాయి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.