దారి కాసిన మృత్యువు | daari kaasina mruthyuvu | Sakshi
Sakshi News home page

దారి కాసిన మృత్యువు

Published Fri, Sep 16 2016 1:35 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

దారి కాసిన మృత్యువు - Sakshi

దారి కాసిన మృత్యువు

కుక్కునూరు : వేలేరు గ్రామంలో జరిగిన గణేష్‌ నిమజ్జనోత్సవంలో గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. లారీ ఢీకొని ఓ యువకుడు మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. వేలేరు గ్రామానికి చెందిన యువకులు  గురువారం వినాయక విగ్రహ నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఊరేగింపు అనంతరం రాత్రి 7 గంటల సమయంలో గణేష్‌ విగ్రహాన్ని నిమజ్జనం చేసే నిమిత్తం కిన్నెరసాని బ్రిడ్జి వద్దకు తరలించి అక్కడ విగ్రహాన్ని దింపుతుండగా, బూర్గంపాడు నుంచి కుక్కునూరు వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వేలేరు గ్రామానికి చెందిన మోదుగ నవీన్‌(17) అక్కడికక్కడే మృతిచెందగా మోదుగ రామకృష్ణ, ప్రవీణ్‌కు గాయాలయ్యాయి.  ప్రవీణ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
ఆశ్రం వద్ద 
గుర్తుతెలియని వ్యక్తి.. 
ఏలూరు సెంట్రల్‌ :  గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మరణించిన ఘటన  ఏలూరు ఆశ్రం ఆస్పత్రి వద్ద గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తికి సుమారు 45 నుంచిl50 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది.∙స్థానికులు రూరల్‌ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు నీలిరంగు చొక్కా, సిమెంటు రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు 08812– 230653 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement