హార్బర్‌లో 2వ నెంబర్ ప్రమాద సూచిక
హార్బర్‌లో 2వ నెంబర్ ప్రమాద సూచిక
Published Wed, Oct 26 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
హార్బర్‌లో 2వ నెంబర్ ప్రమాద సూచిక
హార్బర్, 2వ నంబర్, ప్రమాదం
harber, 2nd, danger, signal
2nd danger signal ina Nizampatnam port
నిజాంపట్నం: తరుముకొస్తున్న తుఫాను ముప్పుతో తీరంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కయాంత్ తుఫాను ప్రభావంతో విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేద్రం ఆదేశాల మేరకు నిజాంపట్నం హార్బర్‌లో 2వ నెంబర్ ప్రమాద సూచిక ఎగరవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరావు బుధవారం తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నంకు తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. తీర ప్రాతంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను హెచ్చరికల ప్రభావంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కయాంత్ తుఫాను శుక్రవారం కావలి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలుపుతుండటంతో తీరంలో అలజడి నెలకొంది. తీరం దాటే సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయోనని తీరవాసులు అంటున్నారు.
Advertisement