harber
-
విశాఖ సాగర తీరంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సముద్రతీరంలోని ఔటర్ హార్బర్లోని జాగ్వర్ టగ్లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. టగ్లో మంటలను అదుపు చేసేందుకు తీరం నుంచి బోట్లను పంపించారు. ప్రమాద సమయంలో టగ్లో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి వుంది. ఔటర్ హార్బర్లో సివిల్ పనుల కోసం సిబ్బందిని తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. హఠాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. ప్రమాదంలో గల్లంతైన ఒకరి కోసం సిబ్బంది గాలింపు చేపట్టారు. జాగ్వర్ టగ్ను పోర్ట్ పనుల కోసం విశాఖ హార్బర్ అద్దెకు తీసుకుంది. శరీరంపై 70శాతం గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యల్లో రాణి రోష్మణి, చార్లి సీ432 నౌకలు పాల్గొన్నాయని కోస్టు గార్డు అధికారులు తెలిపారు. విశాఖ ఏసీపీ మోహన్ రావు వెల్లడించిన వివరాల ప్రకరాం. ‘జాగ్వార్ టగ్లో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. నౌక నిర్వహణ పనులు జరుగుతుండగా హఠాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో 6గురు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలిస్తున్నాం. గాయపడిన15 మంది మై క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐఎన్ఎస్ కల్యాణిలో మరి కొందరున్నారన్న సమాచారం తెలియదని’ పేర్కొన్నారు -
హార్బర్లో 2వ నెంబర్ ప్రమాద సూచిక
హార్బర్లో 2వ నెంబర్ ప్రమాద సూచిక హార్బర్, 2వ నంబర్, ప్రమాదం harber, 2nd, danger, signal 2nd danger signal ina Nizampatnam port నిజాంపట్నం: తరుముకొస్తున్న తుఫాను ముప్పుతో తీరంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కయాంత్ తుఫాను ప్రభావంతో విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేద్రం ఆదేశాల మేరకు నిజాంపట్నం హార్బర్లో 2వ నెంబర్ ప్రమాద సూచిక ఎగరవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరావు బుధవారం తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నంకు తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. తీర ప్రాతంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను హెచ్చరికల ప్రభావంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కయాంత్ తుఫాను శుక్రవారం కావలి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలుపుతుండటంతో తీరంలో అలజడి నెలకొంది. తీరం దాటే సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయోనని తీరవాసులు అంటున్నారు.