విశాఖ సాగర తీరంలో భారీ అగ్నిప్రమాదం | Fire Accident at Visakha Harber | Sakshi
Sakshi News home page

విశాఖ హార్బర్‌లో జాగ్వర్‌ టగ్‌లో అగ్నిప్రమాదం​

Published Mon, Aug 12 2019 3:14 PM | Last Updated on Mon, Aug 12 2019 8:44 PM

Fire Accident at Visakha Harber - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ సముద్రతీరంలోని ఔటర్‌ హార్బర్‌లోని జాగ్వర్‌ టగ్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. టగ్‌లో మంటలను అదుపు చేసేందుకు తీరం నుంచి బోట్లను పంపించారు. ప్రమాద సమయంలో టగ్‌లో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి వుంది. ఔటర్ హార్బర్‌లో సివిల్ పనుల కోసం సిబ్బందిని తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. హఠాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. ప్రమాదంలో గల్లంతైన ఒకరి కోసం సిబ్బంది గాలింపు చేపట్టారు. జాగ్వర్‌ టగ్‌ను పోర్ట్‌ పనుల కోసం విశాఖ హార్బర్‌ అద్దెకు తీసుకుంది. శరీరంపై 70శాతం గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యల్లో రాణి రోష్మణి, చార్లి సీ432 నౌకలు పాల్గొన్నాయని కోస్టు గార్డు అధికారులు తెలిపారు.   

విశాఖ ఏసీపీ మోహన్ రావు వెల్లడించిన వివరాల ప్రకరాం. ‘జాగ్వార్‌ టగ్‌లో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. నౌక నిర్వహణ పనులు జరుగుతుండగా హఠాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో 6గురు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలిస్తున్నాం. గాయపడిన15 మంది మై క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐఎన్ఎస్ కల్యాణిలో మరి కొందరున్నారన్న సమాచారం తెలియదని’ పేర్కొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement