మిషన్‌భగీరథ పనుల్లో ప్రమాదం
మ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ పరిధిలోని సుభాష్‌నగర్ శివారులో జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనుల వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బండి రాజయ్య(35) మృతి చెందాడు.
-
ట్యాంక్‌పై నుంచి పడి నలుగురికి గాయాలు
-
చికిత్స పొందుతూ ఒకరు మృతి
వాటర్ ట్యాంక్ పైన తలకిందులైన మిల్లర్ బకెట్
తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ పరిధిలోని సుభాష్‌నగర్ శివారులో జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనుల వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బండి రాజయ్య(35) మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు.. సుభాష్‌నగర్ వద్ద గతంలో ఓహెచ్‌బీఆర్ ట్యాంక్ ఉండగా పక్కనే మరో ట్యాంక్‌ని నిర్మిస్తున్నారు. ట్యాంక్ చాలా ఎత్తులో పని ఉండడంతో మిల్లర్ ద్వారా కాంక్రీట్‌ని తరలిస్తూ ట్యాంక్ చుట్టూ గాజును పోస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కరీంనగర్‌లోని లేబర్ అడ్డా నుంచి 25 మంది కూలీలు పనికి వచ్చారు. ఉదయం పని చేసిన తరువాత భోజనానికి కూలీలు కిందకు దిగారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి పనిలో చేరేందుకు మిల్లర్ బకెట్‌లో పైవరకు వెళ్లగా అదుపుతప్పి బకెట్ తలకిందులైంది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు పైనుంచి కింద పడిపోయారు. అక్కడున్న వారు వెంటనే ఎల్‌ఎండీ పోలీసులకు, 108కి సమాచారం అందించారు. ఎల్‌ఎండీ ఎస్సై జగదీష్ సంఘటన స్థలానికి చేరుకుని ముగ్గురిని 108లో, మరో వ్యక్తిని కాంట్రాక్టర్‌కు చెందిన వాహనంలో కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో చిగురుమామడి మండలం గాగిరెడ్డిపల్లెకు చెందిన బండి రాజయ్య(35)కు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. జమ్మికుంట మండలం సనుగులకు చెందిన జూపాక శంకర్, సైదాపూర్ మండలం లింగాల దుద్దెనపల్లికి చెందిన పెరుమాండ్ల శ్రీనివాస్, కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న తమిళనాడుకు చెందిన ఎన్.వెంకటేష్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీటీసీ శరత్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు జీవీ.రాంకిషన్‌రావు, గోగూరి నర్సింహారెడ్డి పరామర్శించారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.