![Abrdn Investment Management To Sell Entire Stake In Hdfc Amc - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/8/hdfc_abrdn.jpg.webp?itok=rUqG8XYf)
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో (ఏఎంసీ) తనకున్న మొత్తం 10.21 శాతం వాటాలను విక్రయించాలని ఏబీఆర్‌డీఎన్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ (ఏఐఎం) యోచిస్తోంది.
ప్రతిపాదిత లావాదేవీ తర్వాత నుంచి హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ కో–స్పాన్సర్‌గా ఏఐఎం పక్కకు తప్పుకోనుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఈ విషయాలు వెల్లడించింది. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ), ఏఐఎం (గతంలో స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్) జాయింట్ వెంచర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కార్యకలాపాలు సాగిస్తోంది.
ఆగస్టులో ఏఐఎం 5.58 శాతం వాటాలను సుమారు రూ. 2,300 కోట్లకు బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా విక్రయించింది. ప్రస్తుతం మిగిలిన 10.21 శాతం వాటాల్లో 9.9 శాతం వాటాలను ఒకే కొనుగోలుదారుకు విక్రయించాలని, మిగతాది వేరుగా అమ్మాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment