ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. తన హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్విస్ ఛాలెంజ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్ వాటాను ఎవరు కొనుగోలు దారులను ఖరారు చేస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ బిడ్డర్ ప్రయోజనాల కోసం డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
స్విస్ ఛాలెంజ్ పద్ధతి
- స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనేది ఓ కంపెనీలో వాటాను మరో సంస్థకు అమ్మేందుకు ఉపయోగపడే బిడ్డింగ్ ప్రక్రియ.
- ఆసక్తిగల సంస్థ (సాధారణంగా ఒక ప్రైవేట్ సంస్థ) ఒక కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ కోసం ఒక ప్రతిపాదనను ప్రారంభిస్తుంది.
- అప్పుడు ప్రభుత్వం ప్రాజెక్టు వివరాలను బహిరంగంగా విడుదల చేసి, ఇతర పార్టీలను తమ ప్రతిపాదనలను సమర్పించమని ఆహ్వానిస్తుంది.
- ఈ ప్రతిపాదనను ప్రారంభించిన అసలు బిడ్డర్(ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్)కు తిరస్కరించే హక్కు ఉంది. అసలు బిడ్డర్‌కు నచ్చితే వాటా అమ్మకం ప్రక్రియ ముందుకు సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment