ఏదైనా వ్యాపారంలో రాణించాలంటే నైతికత, నిబద్ధత చాలా అసవరం. కానీ చాలా సంస్థలు దీన్ని పెద్దగా పట్టించుకోవు. కానీ రతన్ టాటా ఆధ్వర్యంలోని టాటా గ్రూప్, తమ కార్పొరేట్ పాలనలో, వ్యాపారం చేసే విధానంలో నైతికతను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తుంది. ఇటీవలికాలంలో కంపెనీ సుదీర్ఘ చరిత్రలో తొలిసారి చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ నియమించుకుంది. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ ఈ కోవలో చేరింది. కంపెనీ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్‌గా మాజీ ఈడీ అధికారి ప్రసూన్ సింగ్‌ను నియమించింది. అసలు ఏవరీ ప్రసూన్ సింగ్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ పోస్టును సృష్టించి మరీ ప్రసూన్ సింగ్‌కు కీలక పోస్ట్‌ను ఇవ్వడం విశేషం. రూ. 9,24,235 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంకుకు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా ఉన్న ప్రసూన్ సింగ్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్‌గా ఎలా ఎదిగారు. (సల్మాన్ బ్రాండ్ న్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్: ఇంటర్నెట్‌లో వీడియో హల్‌చల్)
ప్రసూన్ సింగ్ ఎవరు?
బిహార్‌లోని ముజఫర్ లోని సెయింట్ జేవియర్స్ స్కూల్ నుండి పాఠశాల విద్యను,. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ఇక్కడ నుంచే బీఏ ఆనర్స్ చేశారు. నవీ ముంబైలోని సీఎస్‌ఎంయూలో న్యాయశాస్త్రం అభ్యసించారు. అతను MIT స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో మేనేజ్‌మెంట్ నేర్చుకున్నారు. (రోజుకు కేవలం రూ.73: యాపిల్ ఐఫోన్ 12మినీ మీ సొంతం!)
ప్రసూన్ సింగ్ కరియర్
సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్ మెంట్‌లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అతను ముంబైలో పోస్టింగ్ పొందారు. ఏడేళ్లు పనిచేసిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)కి వెళ్లారు. ఆతరువాత ఏడేళ్లకు పైగా ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. జూలై 2013ల ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌గా చేరారు. నాలుగేళ్ల తర్వాత ప్రైవేట్ రంగంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా చేరారు.
అక్కడ కూడా ఏడేళ్లపాటు ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. దీని తర్వాత, అతను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా ఈడీకి మారారు. అక్కడ కూడా సుమారు నాలుగేళ్లపాటు అధికారిగా పనిచేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సివో)గా, 9సంవత్సరాల 9 నెలలకు పైగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సేవలందించారు ప్రసూన్. తాజాగా బ్యాంక్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్‌గా ఎంపియ్యారు.
♦ 2009, నవంబరు నుంచి జూలై 2013 మధ్య ఈడీ అధికారిగా
♦ 2002 జూలై - 2009 నవంబర్ మధ్య ఇంటెలిజెన్స్ అధికారి
♦ 1995 మే- 2002 జూలై మధ్య ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్
నైతికత గురించి రతన్ టాటా ఏమన్నారంటే
కంపెనీలు లాభాలు ఆర్జించడం తప్పు కాదు, ఈ పనిని నైతికంగా చేయడం కూడా అవసరమని టాటా గ్రూప్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా నమ్ముతారు. లాభం పొందడానికి మీరు ఏమి చేస్తున్నారో ఈ ప్రశ్న చాలా ముఖ్యమనీ. లాభాలను ఆర్జిస్తున్నప్పుడు, కస్టమర్లు వాటాదారులకు ఎలాంటి ప్రయోజ నాందిస్తున్నామో కంపెనీలు గుర్తుంచు కోవడం కూడా ముఖ్యం. అలాగే ప్రస్తుత పరిస్థితిలో, నిర్వాహకులు తాము తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవా? కాదా? అని తమను తాము ప్రశ్నించు కోవాలి. కంపెనీ ఎక్కువ కాలం మనుగడ సాగించదని, అది ఉద్యోగుల పట్ల సున్నితంగా ఉండదని కూడా ఆయన అన్నారు. వ్యాపారం గురించి తన ఆలోచనను వివరిస్తూ, వ్యాపారం అంటే లాభాలు సంపాదించడం మాత్రమే కాదని అన్నారు. మీతో అనుబంధం ఉన్న వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగుల ప్రయోజనాలు చాలా ముఖ్యమని రతన్ టాటా చెబుతారు. (అమెరికా ఫైనాన్స్‌లో ఇండో-అమెరికన్ మహిళల సత్తా)
Comments
Please login to add a commentAdd a comment