Ratantata
-
సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?
ఏదైనా వ్యాపారంలో రాణించాలంటే నైతికత, నిబద్ధత చాలా అసవరం. కానీ చాలా సంస్థలు దీన్ని పెద్దగా పట్టించుకోవు. కానీ రతన్ టాటా ఆధ్వర్యంలోని టాటా గ్రూప్, తమ కార్పొరేట్ పాలనలో, వ్యాపారం చేసే విధానంలో నైతికతను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తుంది. ఇటీవలికాలంలో కంపెనీ సుదీర్ఘ చరిత్రలో తొలిసారి చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ నియమించుకుంది. తాజాగా హెచ్డీఎఫ్సీ ఈ కోవలో చేరింది. కంపెనీ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్‌గా మాజీ ఈడీ అధికారి ప్రసూన్ సింగ్‌ను నియమించింది. అసలు ఏవరీ ప్రసూన్ సింగ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ పోస్టును సృష్టించి మరీ ప్రసూన్ సింగ్‌కు కీలక పోస్ట్‌ను ఇవ్వడం విశేషం. రూ. 9,24,235 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంకుకు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా ఉన్న ప్రసూన్ సింగ్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్‌గా ఎలా ఎదిగారు. (సల్మాన్ బ్రాండ్ న్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్: ఇంటర్నెట్లో వీడియో హల్చల్) ప్రసూన్ సింగ్ ఎవరు? బిహార్‌లోని ముజఫర్ లోని సెయింట్ జేవియర్స్ స్కూల్ నుండి పాఠశాల విద్యను,. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ఇక్కడ నుంచే బీఏ ఆనర్స్ చేశారు. నవీ ముంబైలోని సీఎస్ఎంయూలో న్యాయశాస్త్రం అభ్యసించారు. అతను MIT స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ నేర్చుకున్నారు. (రోజుకు కేవలం రూ.73: యాపిల్ ఐఫోన్ 12మినీ మీ సొంతం!) ప్రసూన్ సింగ్ కరియర్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్ మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అతను ముంబైలో పోస్టింగ్ పొందారు. ఏడేళ్లు పనిచేసిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కి వెళ్లారు. ఆతరువాత ఏడేళ్లకు పైగా ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. జూలై 2013ల ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌గా చేరారు. నాలుగేళ్ల తర్వాత ప్రైవేట్ రంగంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా చేరారు. అక్కడ కూడా ఏడేళ్లపాటు ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. దీని తర్వాత, అతను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ఈడీకి మారారు. అక్కడ కూడా సుమారు నాలుగేళ్లపాటు అధికారిగా పనిచేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సివో)గా, 9సంవత్సరాల 9 నెలలకు పైగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సేవలందించారు ప్రసూన్. తాజాగా బ్యాంక్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్‌గా ఎంపియ్యారు. ♦ 2009, నవంబరు నుంచి జూలై 2013 మధ్య ఈడీ అధికారిగా ♦ 2002 జూలై - 2009 నవంబర్ మధ్య ఇంటెలిజెన్స్ అధికారి ♦ 1995 మే- 2002 జూలై మధ్య ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నైతికత గురించి రతన్ టాటా ఏమన్నారంటే కంపెనీలు లాభాలు ఆర్జించడం తప్పు కాదు, ఈ పనిని నైతికంగా చేయడం కూడా అవసరమని టాటా గ్రూప్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా నమ్ముతారు. లాభం పొందడానికి మీరు ఏమి చేస్తున్నారో ఈ ప్రశ్న చాలా ముఖ్యమనీ. లాభాలను ఆర్జిస్తున్నప్పుడు, కస్టమర్లు వాటాదారులకు ఎలాంటి ప్రయోజ నాందిస్తున్నామో కంపెనీలు గుర్తుంచు కోవడం కూడా ముఖ్యం. అలాగే ప్రస్తుత పరిస్థితిలో, నిర్వాహకులు తాము తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవా? కాదా? అని తమను తాము ప్రశ్నించు కోవాలి. కంపెనీ ఎక్కువ కాలం మనుగడ సాగించదని, అది ఉద్యోగుల పట్ల సున్నితంగా ఉండదని కూడా ఆయన అన్నారు. వ్యాపారం గురించి తన ఆలోచనను వివరిస్తూ, వ్యాపారం అంటే లాభాలు సంపాదించడం మాత్రమే కాదని అన్నారు. మీతో అనుబంధం ఉన్న వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగుల ప్రయోజనాలు చాలా ముఖ్యమని రతన్ టాటా చెబుతారు. (అమెరికా ఫైనాన్స్‌లో ఇండో-అమెరికన్ మహిళల సత్తా) -
టాటా సంచలన నిర్ణయం, సర్వత్రా హర్షం
Tata Steel Hires 14 Transgender People: అనితర సాధ్యుడు..ఓటమి ఎరుగని ధీరుడు..రతన్ టాటా పరిచయం అక్కర్లేని పేరు. దేశంలో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పడమే కాదు విలువలు, దాతృత్వానికి మారు పేరు. ముఖ్యంగా సందర్భాన్ని బట్టి మానవత్వం ప్రదర్శించడంలో రతన్ టాటాను మించిన వారెవరూ ఉండరేమో. అలాంటి లివింగ్ లెజెండ్ రతన్ టాటా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజం నుంచి వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్ల భవిష్యత్తును తీర్చిదిద్దేంకు కృషి చేస్తున్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. జార్ఖండ్‌లోని రామ్‌ఘర్ జిల్లాలోని పశ్చిమ బొకారో డివిజన్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ ఆపరేటర్లుగా 14 మంది ట్రాన్స్జెండర్లను నియమించారు. ప్రస్తుతం ఈ 14మంది శిక్షణలో ఉన్నారని వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మైనింగ్ కార్యకలాపాల్లో విధులు నిర్వహిస్తారని టాటా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా, అంతకుముందు కంపెనీ 17మంది మహిళలను హెచ్ఇఎమ్ఎమ్ ఆపరేటర్లుగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా టాటా స్టీల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆత్రయీ సన్యాల్ మాట్లాడుతూ..ఇదే మాడ్యూల్లో పనిచేసేందుకు ఆన్‌బోర్డ్‌లో ఉన్న ట్రాన్స్జెండర్లు గనులలో పనిచేయడానికి ముందే సంవత్సరం పాటు శిక్షణ పొందుతారని తెలిపారు. అంతేకాదు ట్రాన్స్జెండర్ల వర్క్ ఫోర్స్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు, 2025 నాటికి 25 శాతం ట్రాన్స్జెండర్లను ఉద్యోగులుగా నియమించేందుకు లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అత్రయీ సన్యాల్ చెప్పారు. ఇదిలా ఉంటే, రతన్ టాటా నిర్ణయం పై నెటిజన్లు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ ఆపత్కాలంలో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశం కల్పించడం గొప్ప విషయమని ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఆ మహానుభావుడు ఉంటే ఎంతో సంతోషించేవాడు.. ఎమోషనలైన రతన్ టాటా -
13 ఏళ్ల నాటి విషాద ఛాయలు..రతన్ టాటా ఆవేదన
ముంబై: ముంబైలో 26/11 ఉగ్రదాడులు జరిగి నేటికి 13 ఏళ్లు అవుతున్నాయని, పైగా ఆనాటి విషాదాంతాన్ని అంత తేలికగా మర్చిపోలేమంటూ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నాటి ఉగ్రదాడుల్లో ధ్యంసం అయిన తాజ్ మహల్ ప్యాలెస్ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ నాటి దాడులకు సంబంధించిన విషాధ ఛాయలను నెటిజన్లుతో పంచుకున్నారు. (చదవండి: కొడుక్కి అరుదైన వ్యాధి.. తండ్రి హైస్కూల్ డ్రాపవుట్.. సొంతంగా మందు తయారీ) ఈ మేరకు రతన్ టాటా మాట్లాడుతూ.... 13 సంవత్సరాల క్రితం మేము అనుభవించిన బాధ, కోల్పోయినవారిని ఎప్పటికీ తిరిగి పొందలేం. అయితే మనం కోల్పోయిన వారిని గౌరవించడం ద్వారా మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ఉద్దేశించి జరిపిన ఉగ్రదాడుల తాలుకా స్మృతులను మన బలానికి మూలంగా మార్చుకోవాలి" అని అన్నారు. అంతేకాదు ఆనాటి ఉగ్రదాడిలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిని అమరవీరులకు రతన్‌టాటా ఈ సందర్భంగా నివాళులర్పించారు. అయితే నవంబర్ 26, 2008న ముంబైలో నాలుగు రోజుల పాటు జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో సుమారు 166 మంది మృతి చెందడమే కాక దాదాపు 300 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రతన్ టాటా ఇన్‌స్టాగామ్‌లో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో) View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) -
బ్రాండ్ ఇమేజ్‌కు ‘టాటా’
సాక్షి, బిజినెస్ విభాగం : టాటా గ్రూప్‌లో సంక్షోభానికి రతన్‌టాటా-సైరస్ మిస్త్రీల మధ్య ఏర్పడిన వ్యక్తిగత విబేధాలే కారణమన్నది మెల్లగా స్పష్టమవుతోంది. ఇంటిపేరు కూడా కలిసిన వారసుడు రతన్‌టాటా... గ్రూప్‌లో అతిపెద్ద వాటాదారుకు వారసుడు సైరస్ మిస్త్రీ... ఇద్దరిలో ఎవరూ కూడా వందేళ్ల టాటా గ్రూప్ ఇమేజ్ను పట్టించుకోలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. కుటుంబ అధిపత్యం ఉన్న కార్పొరేట్ కంపెనీలు కూడా ఏ సీఈఓనూ, ఎండీనీ బయటకు పంపించని రీతిలో మిస్త్రీని టాటాలు అగౌరవ పరిచి ఉద్వాసన చెప్పారన్నది నిస్సందేహం. ఇక ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డుకు రాసిన లేఖలో రతన్‌పై చేసిన తీవ్ర ఆరోపణలు గ్రూప్ స్థాయిని మరింత దిగజార్చాయి. రతన్- సైరస్ మిస్త్రీ ఇద్దరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకునే స్థితికి వచ్చేశారంటే వ్యక్తిగత విబేధాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. టాటా గ్రూప్ వెతలకు బాధ్యులెవరు? ఇక్కడ గమనించాల్సిందొకటుంది. మిస్త్రీ లేఖలో చేసిన ఆరోపణల్లో వ్యక్తిగతమైనవి పక్కనబెడితే ప్రధానమైనది గ్రూప్ రుణభారం పెరిగిపోయిందనేది. కోరస్ స్టీల్ కొనుగోలు, ముంద్రా ప్రాజెక్టులో టాటా పవర్ పెట్టిన పెట్టుబడులు, ఇండియన్ హోటల్స్ విదేశాల్లో భారీ ధరకు కొన్న హోటళ్లు... వాటన్నిటితో రూ.1.18 లక్షల కోట్లు రైటాఫ్ చేయాల్సి ఉంటుందని మిస్త్రీ పేర్కొన్నారు. నిజానికివన్నీ రతన్ టాటా హయాంలో జరిగినవే. కానీ ఆ మూడు రంగాల పనితీరూ కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా బాగులేదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడు, ఆయా రంగాల వృద్ధి జోరుగా వున్నపుడు చేసిన టేకోవర్లు అవి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాపారాలు బాగులేనపుడు... మిస్త్రీ వాటిని చక్కదిద్దలేకపోయారని నిందించటమూ సరికాదు. ఉక్కుకు డిమాండ్ లేనంత మాత్రాన మిట్టల్ ఉక్కు వ్యాపారాన్ని వదిలేశారా? అనిల్ అంబానీ, అదానీలు పవర్ వ్యాపారాన్ని అమ్ముకున్నారా? అలాంటిది వందేళ్లుగా 100 రకాల వ్యాపారాన్ని చేస్తూ...ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న టాటా గ్రూప్ వీటిని వదిలించుకోవాల్సిన పనిలేదన్నది రతన్ వాదన కావొచ్చు. గ్రూప్ ప్రమోటర్లయిన టాటా ట్రస్టులు.. తన పనితీరునే ప్రామాణికంగా చూస్తున్నపుడు ఈ వ్యాపారాల నుంచి వైదొలిగి.. గ్రూప్ రుణభారాన్ని తగ్గించే ప్రయత్నా ల్ని చేయటం తప్పు కాదన్నది మిస్త్రీ మాట. ఈ లెక్కన గ్రూప్ వెతలకు ఇద్దరినీ బాధ్యులుగా చూడలేం. ఆ ‘తీరే’ ఇబ్బందికరం... పనితీరు నచ్చనంత మాత్రాన ఏ కంపెనీ సీఈఓకూ హఠాత్తుగా ఉద్వాసన చెప్పరు. గౌరవంగా వైదొలిగే మార్గాన్ని కల్పిస్తారు. తాజా పరిణామాలు చూస్తే... మిస్త్రీ తీరు కొన్నాళ్లుగా రతన్ టాటాకు నచ్చకపోయి ఉండొచ్చు. కానీ తొలగింపు నిర్ణయం ఆకస్మికమేనని స్పష్టమవుతోంది. మిస్త్రీ తాజా లేఖ దీనికి అద్దం పడుతోంది. నిజానికి ఈ తొలగింపునకు రతన్ టాటాలో పెరిగిన వ్యక్తిగత విద్వేషమే కారణమై ఉండొచ్చని మిస్త్రీ లేఖ చెబుతోంది. రతన్ టాటాపై ఆయన చేసిన వ్యక్తిగత ఆరోపణలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఇక టాటా సన్స్ బోర్డు సమావేశం జరుగుతున్నపుడు డెరైక్టర్లు బోర్డు రూమ్ నుంచి వెలుపలికి వెళ్లి రతన్ టాటాకు ఫోన్లు చేసేవారని, ఇవి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు దారితీస్తాయన్న తీవ్ర ఆరోపణను కూడా మిస్త్రీ సంధించారు. ఇవన్నీ వీరిద్దరి మధ్య ఉన్న అగాథాన్ని బయటపెట్టేవే. అ అగాథం సంగతెలా ఉన్నా... మిస్త్రీ లేఖతో కొంత మిస్టరీ వీడింది. బ్రాండ్ పరువు బజారులో పడింది. -
స్మార్ట్‌కు సపోర్ట్
టాటా ట్రస్టు సహకారం సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై ఒప్పందం విజయవాడ : ఆధునిక టెక్నాలజీతో పాటు టాటా ట్రస్టు అందిస్తున్న సహకారాన్ని ఉపయోగించుకుని ప్రతి గ్రామాన్ని, వార్డును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పంచాయతీలకు అభివృద్ధి వివరాలను తెలియపరిచేందుకు గ్రామ కార్యదర్శులకు ట్యాబ్‌లు ఇస్తామని చెప్పారు. ఎనికేపాడులో 24 కే కన్వెన్షన్ సెంటర్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని 264 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టాటా ట్రస్టుతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామాణాభివృద్ధి అదనపు కార్యదర్శి శాంతిప్రియ పాండె, టాటా ట్రస్టు సీఈవో ఆర్.వెంకట్ రామన్ అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్మార్ట్ విలేజ్‌లు, వార్డుల అభివృద్ధికి టాటా ట్రస్టు సహకారం తీసుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు స్మార్ట్‌గా ఆలోచించి గ్రామాలను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం గ్రామాల నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారి సహాయం తీసుకోవాలని సూచించారు. కేశినేని నానిని ఆదర్శంగా తీసుకోండి... ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) చొరవ చూపించి టాటా ట్రస్టు చైర్మన్ రతన్‌టాటాతో సంప్రదింపులు చేసి నియోజకవర్గంలోని గ్రామాలను దత్తత తీసుకునేందుకు కృషి చే శారని, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. రతన్‌టాటా దేశం గర్వించదగిన వ్యక్తని, ఇతర దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు దీటుగా టాటా గ్రూపును అభివృద్ధి చేశారని తెలిపారు. నానో టెక్నాలజీని మన దేశం కూడా చేయగలదని నిరూపించారని కొనియాడారు. చంద్రబాబుతో ఎంతోకాలంగా అనుబంధం... చంద్రబాబుతో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని రతన్‌టాటా అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే చొరవ ముఖ్యమంత్రికి ఉందన్నారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ టాటా ట్రస్టు వెదురు పెంపకం, మత్స్య, పౌష్టికాహారం, గ్రామాల అభివృద్ధి సూక్ష ప్రణాళిక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. విజయవాడ బాంబూ (వెదురు) మిషన్ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి, రతన్‌టాటాలు సంయుక్తంగా ప్రారంభించారు. వెదురు మిషన్ అమలుకు కృషి చేసిన ఆదర్శరైతు సీతారాం ప్రసాద్, డీఎఫ్‌వో అశోక్‌కుమార్‌లను సీఎం అభినందించారు. రతన్‌టాటా, చంద్రబాబులపై కేశినేని నాని కుమార్తెలు శ్వేత, హేమలు రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, శాసనసభ్యులు జలీల్‌ఖాన్, రక్షణనిధి, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టక్కర్, కలెక్టర్ బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు. బిజీబిజీగా రతన్‌టాటా... టాటా ట్రస్టు చైర్మన్ రతన్‌టాటా విజయవాడలో ఒకరోజు పర్యటన బిజీబిజీగా గడిపారు. సీఎం చంద్రబాబుతో రతన్‌టాటా, ఎంపీ కేశినేని నాని సమావేశం నిర్వహించి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం 24 కే కన్వెన్షన్ హాలులో జరిగిన జరిగిన సమావేశంలో పాల్గొని విజయవాడ పార్లమెంట్ అభివృద్ధిపై అంగీకారం కుదుర్చుకున్నారు.