
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనమయ్యేందుకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నుంచి తమకు ఆమోదముద్ర లభించిందని గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది.
అలాగే రెండు అనుబంధ సంస్థలు.. హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్ విలీనానికి కూడా అనుమతి దక్కిందని పేర్కొంది. ఆగస్టు 8న ఎన్‌హెచ్‌బీ ఈ మేరకు నిరభ్యంతర పత్రం జారీ చేసినట్లు వివరించింది. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో పాటు స్టాక్ ఎక్ఛేంజీలు (ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ) కూడా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.
విలీన సంస్థకు దాదాపు రూ. 18 లక్షల కోట్ల మేర అసెట్‌లు ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. ఇది పూర్తయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ 100 శాతానికి చేరుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌హోల్డర్ల వాటా 41 శాతంగా ఉంటుంది.
చదవండి👉 వాడకం మామూలుగా లేదుగా! పెరిగిపోతున్న క్రెడిట్ కార్డ్‌ల వినియోగం..ఎంతలా అంటే?
Comments
Please login to add a commentAdd a comment