NHB
-
హెచ్డీఎఫ్సీ ట్విన్స్ విలీనానికి ఎన్‌హెచ్‌బీ ఆమోదం!
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనమయ్యేందుకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నుంచి తమకు ఆమోదముద్ర లభించిందని గృహ రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. అలాగే రెండు అనుబంధ సంస్థలు.. హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్, హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్ విలీనానికి కూడా అనుమతి దక్కిందని పేర్కొంది. ఆగస్టు 8న ఎన్‌హెచ్‌బీ ఈ మేరకు నిరభ్యంతర పత్రం జారీ చేసినట్లు వివరించింది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో పాటు స్టాక్ ఎక్ఛేంజీలు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) కూడా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. విలీన సంస్థకు దాదాపు రూ. 18 లక్షల కోట్ల మేర అసెట్లు ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. ఇది పూర్తయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ 100 శాతానికి చేరుతుంది. హెచ్డీఎఫ్సీ షేర్‌హోల్డర్ల వాటా 41 శాతంగా ఉంటుంది. చదవండి👉 వాడకం మామూలుగా లేదుగా! పెరిగిపోతున్న క్రెడిట్ కార్డ్‌ల వినియోగం..ఎంతలా అంటే? -
ఎన్‌హెచ్‌బీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియరీ
ముంబై: గృహ రుణ సెక్యూరిటైజేషన్ మార్కెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు చేసింది. నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) ఆధ్వర్యంలో ఓ మధ్యవర్తిత్వ (ఇంటర్ మీడియరీ) సంస్థను 51 శాతం ప్రభుత్వ వాటాతో ఏర్పాటు చేయాలని సూచించింది. బెయిన్ అండ్ కో సీనియర్ అడ్వైజర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 29న ఆర్బీఐ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను సోమవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌కు సమరి్పంచింది. గృహ రుణాల సెక్యూరిటైజేషన్ అంటే... రుణాలను ప్రత్యేక ప్రయోజన విభాగం (ఎస్పీవీ)కు బదిలీ చేయడం. ఆ సంస్థ ఆయా రుణాలకు సంబంధించి సెక్యూరిటీలను జారీ చేస్తుంది. వీటిని పాస్ త్రూ సరి్టఫికెట్స్ (పీటీసీ) అని పిలుస్తారు. ఈ సరి్టఫికెట్లకు అనుసంధానంగా రుణాలు ఉంటాయి. దీనివల్ల రుణాలిచి్చన సంస్థలు, ఆ రుణాలను లిక్విడ్ సెక్యూరిటీలు(ట్రేడ్ అయ్యేవి)గా మార్చుకోగలవు. -
ఇండియా బుల్స్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: సోమవారం నాటి నష్టాల మార్కెట్లో ఇండియా బుల్స్ గ్రూపునకు భారీ షాక్ తగిలింది. పలు షెల్ కంపెనీలద్వారా ఇండియాబుల్స్ గ్రూప్ రూ. లక్ష కోట్లకు పైగా నిధులను అక్రమంగా దారి మళ్లించిందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు దీనిపై సిట్ ద్వారా దర్యాప్తు చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివారం లేఖ రాసినట్టుగా వార్తలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన లేఖ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో దాదాపు100 షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. దీంతో ఈ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంకు(ఎన్‌హెచ్‌బీ) నుంచి షెల్ కంపెనీల ద్వారా నిధులను సమీకరించి ఇండియాబుల్స్ గ్రూప్ అక్రమంగా మళ్లించినట్లు సుబ్రమణ్యన్ స్వామి ఆరోపించారు. మనీలాండరింగ్ స్కామ్ కింద సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐవో, ఐటీ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయవలసిందిగా ప్రధాని మోదీని కోరినట్టు సమాచారం. ట్రేడింగ్‌లో ఇండియాబుల్స్ గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్ కంపెనీల కౌంటర్లలో అమ్మకాల వెల్లువ కురిసింది. ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ 10 శాతానికిపైగా పడిపోయి టాప్‌లూజర్‌గా నమోదైంది. ఐబీ వెంచర్స్ 5 శాతం, ఐబీ కన్జూమర్ ఫైనాన్స్ 3 శాతం ఇండియాబుల్స్ రియల్టీ 8.4 శాతం పతనమయ్యాయి. ఐబీ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ షేరు 5శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ. 121.55 వద్ద ఫ్రీజ్ అయింది. మరోవైపు బీజేపీ నేత ఆరోపణలను ఇండియా బుల్స్ హౌసింగ్ బీఎస్ఈ ఫైలింగ్‌లో తీవ్రంగా ఖండించింది. జూన్ 28నాటి సుబ్రమణియన్ స్వామి ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను హైలైట్ చేయాలనుకుంటున్నామంటూ వివరణ ఇచ్చింది. ఎన్‌హెచ్‌బి నుంచి ఇండియాబుల్స్ హౌసింగ్‌కు ఎలాంటి రుణాలులేవని కంపెనీ సీఈవో గగన్ బాంగా స్పష్టం చేశారు. అసలు తమ చరిత్రలో ఎన్‌బీహెచ్ నుంచి లోన్స్ గానీ, రీఫైనాన్సింగ్ నిధులను గానీ తీసుకోలేదన్నారు. తమ మొత్తం లోన్‌బుక్ సుమారు రూ.87,000 కోట్లుగా ఉందని వివరించారు -
గృహ రుణాలపై వడ్డీ రాయితీ అమల్లోకి
⇒ జనవరి 1 నుంచి వర్తింపు; మార్గదర్శకాలు విడుదల... ⇒ నెలకు రూ. 2 వేల దాకా తగ్గనున్న ఈఎంఐ భారం ⇒ 70 ఆర్థిక సంస్థలతో ఎన్‌హెచ్‌బీ ఒప్పందం న్యూఢిల్లీ: మధ్య ఆదాయ వర్గాల కోసం ప్రకటించిన గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం ప్రయోజనాలను కేంద్రం జనవరి 1 నుంచి వర్తింపచేయనుంది. ఇందుకు సంబంధించిన సీఎల్ఎస్ఎస్ (మధ్య ఆదాయ గ్రూపుల – ఎంఐజీ) మార్గదర్శకాలను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండీ శ్రీరామ్ కల్యాణరామన్ బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆవిష్కరించారు. జనవరి 1 నుంచి ఈ పథకం ప్రయోజనాలను వర్తింపచేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ స్కీముతో మధ్య ఆదాయ వర్గాల లబ్దిదారులకు ఈఎంఐల భారం నెలకు రూ. 2,000 దాకా తగ్గనున్నట్లు ఆయన చెప్పారు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్‌ను (సీఎల్ఎస్ఎస్–ఎంఐజీ) ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్ 31న ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్కీమ్ నిర్వహణ మార్గదర్శకాలనే కల్యాణరామన్ ఆవిష్కరించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సీఎల్‌ఎస్‌ఎస్‌ను (ఎంఐజీ) అమలు చేసేందుకు 45 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, 15 బ్యాంకులతో పాటు మొత్తం 70 ఆర్థిక సంస్థలు నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌తో బుధవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషించే మధ్యతరగతి వర్గాల సొంతింటి కల సాకారానికి తోడ్పాటునివ్వడం అవసరమని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర గృహ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. స్కీము స్వరూపం ఇదీ.. సీఎల్ఎస్ఎస్ (ఎంఐజీ) కింద రూ.12 లక్షల దాకా వార్షికాదాయం గల వారు తీసుకునే గృహ రుణాల్లో రూ.9 లక్షల దాకా పరిమాణంపై 4 శాతం మేర వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. అలాగే రూ. 18 లక్షల దాకా వార్షికాదాయం గల ఉన్నవారికి రూ. 12 లక్షల దాకా గృహ రుణాలపై 3 శాతం వడ్డీ సబ్సిడీ దక్కుతుంది. గృహ రుణాలపై వడ్డీ రేటు 8.65 శాతంగా పరిగణించిన పక్షంలో... 4 శాతం వడ్డీ సబ్సిడీతో రూ.9 లక్షల హౌసింగ్ లోన్‌పై నెలకు ఈఎంఐ భారం రూ.2,062 దాకా తగ్గుతుందని కల్యాణరామన్ చెప్పారు. అలాగే 3 శాతం వడ్డీ సబ్సిడీతో రూ. 12 లక్షల రుణంపై నెలవారీ వాయిదాల భారం రూ. 2,019 మేర తగ్గగలదని వివరించారు. జనవరి 1 నుంచి స్కీమును వర్తింపచేస్తున్నందున ఈ ఏడాది ప్రారంభం నుంచి గృహ రుణం పొందినవారు లేదా దరఖాస్తులు ప్రాసెసింగ్ ప్రక్రియలో ఉన్న వారు రూ.2.35 లక్షల దాకా వడ్డీ సబ్సిడీ ప్రయోజనాలు పొందడానికి అర్హులని కల్యాణరామన్ పేర్కొన్నారు. రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షల దాకా వార్షికాదాయాలు ఉన్న మధ్య ఆదాయ వర్గాలు కూడా కొత్త సీఎల్ఎస్ఎస్ (ఎంఐజీ) కింద వడ్డీ సబ్సిడీ పొందేందుకు అర్హులని ఆయన వివరించారు.