సాక్షి, ముంబై: ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్‌కి గుడ్ న్యూస్. బంపర్ ఆఫర్లతో ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మీ ముందుకు రాబోతున్నాయి. 'బిగ్ బిలియన్ సేల్' పేరుతో ఫ్లిప్‌కార్ట్, 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' పేరుతో అమెజాన్ భారీ డిస్కౌంట్ సేల్ నిర్వహించబోతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ మెగా సేల్ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అమెజాన్‌లోని ఆఫర్ సేల్ తేదీలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ దాదాపు అవే తేదీల్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా దసరా, దీపావళి పండుగ సీజన్ల కంటే ముందుగా ఈ భారీ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నిర్వహిస్తుంటుంది.
ఇవీ అమెజాన్ స్పెషల్స్..
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్లతోపాటు కొత్త ప్రాడెక్ట్స్‌ను కూడా లాంచ్ చేయబోతున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న వన్‌ప్లన్ 5T మొబైల్‌తోపాటు అలెక్సా వాయిస్ రిమోట్ ఆప్షన్ కలిగిన ఫైర్‌స్టిక్‌ను ఆఫర్లలో భాగంగా విడుదల చేయబోతున్నారు. ఈ ఫైర్‌స్టిక్ ధర రూ.2,999. ఈ గ్యాడ్జెట్‌ను ఇప్పడే ప్రీ ఆర్డర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. వన్‌ప్లస్, శాంసంగ్, షియోమీ, వివో, ఒప్పో, నోకియా, హనర్ మోబైళ్లతోపాటు యాపిల్ ఐఫోన్లపైనా భారీ డిస్కౌంట్ ఉంటుంది. షియోమీ నోట్ బుక్ 14, ఎంఐ నోట్ బుక్ 14 హారిజాన్ ల్యాప్‌టాప్‌లు, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డివైజ్‌లకు కూడా ఆఫర్ ప్రైస్ వర్తిస్తుంది. టీవీ, ఫ్రిడ్జ్ తదితర గృహోపకరణాలపైనా ప్రత్యేక ఆఫర్లున్నాయి. (చదవండి: అమెజాన్‌లో 10 లక్షల ఉద్యోగాలు)
ఫ్లిప్‌కార్ట్‌లో వీటిపై భారీ ఆఫర్..
ఆఫర్ సేల్‌లో డీల్స్ గురించి ఒక్కొక్కటిగా ఫ్లిప్‌కార్ట్ వెల్లడిస్తోంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్ ఉంటుందని ప్రకటించింది. ల్యాప్‌టాప్స్‌పై 60 శాతం, టీవీలపై 75 శాతం తగ్గింపు ధరలు ఉంటాయని తెలిపింది. క్లాతింగ్, స్పోర్ట్స్ గూడ్స్‌పై 60 నుంచి 80 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఆఫర్ సేల్ జరిగే రోజుల్లో ప్రతి 8 గంటలకు టాప్ బ్రాండ్స్‌పై స్పెషల్ డీల్స్ ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ 16వ తేదీన ప్రారంభంకానుండగా.. ఫ్లిప్‌కార్ట్‌ప్లస్ అకౌంట్స్ ఉన్నవాళ్లకు 15వ తేదీ రాత్రి 8 గంటలకే సేల్ స్టార్ట్ అవుతుంది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో 70వేల ఉద్యోగాలు)
ఈ కార్డ్స్ ఉంటే మరో 10% డిస్కౌంట్
మెగా సేల్‌లో భాగంగా మరింత డిస్కౌంట్ రేట్లతో వస్తువులు కొనాలనుకునే వారి కోసం ఈసారి ఫ్లిప్‌కార్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో, అమెజాన్ హెచ్‌ఎఫ్‌డీసీ బ్యాంక్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనేవారికి ఫ్లిప్‌కార్ట్‌లో10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనేవారికి 10 శాతం తగ్గింపు ధర లభిస్తుంది. ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, బజాజ్ ఫిన్సర్వ్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌లో పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసేవారికి క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment