ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా రిపబ్లిక్ డే ఉత్సవాల పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రకటించాయి. అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ పేరుతో ఈ సేల్‌ను జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తోంది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్' పేరుతో ఈ సేల్‌ను జనవరి 17 నుంచి 22 వరకు నిర్వహిస్తోంది. ఈ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గృహోపకరణాలు సహా ఇతర అన్ని రకాల వస్తువులపైనా భారీ డిస్కాంట్లతో విక్రయించనున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ సేల్:
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్' సేల్‌ను జనవరి 17 నుంచి 22 వరకు కొనసాగనుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లకు మాత్రం ఈ ఆఫర్లు నేటి(జనవరి 16) నుంచే అందుబాటులోకి వచ్చింది. యాపిల్, రియల్మీ, పోకో, షియోమీ, శాంసంగ్, ఒప్పొ, ఇన్ఫీనిక్స్ వంటి వాటిపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. గృహోపకరణాలపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలాగే, ఐసీఐసీఐ కార్డు చెల్లింపులపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇంకా ఎలక్ట్రానిక్, వస్త్రాలు, బ్యూటీ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను ఈ రెండు సంస్థలు అందిస్తున్నాయి.
అమెజాన్ సేల్:
అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో ప్రత్యేక సేల్‌ను ఈ నెల 17 నుంచి 20 వరకు నిర్వహిస్తోంది. అయితే ప్రైమ్ యూజర్లకు మాత్రం ఒక రోజు ముందుగానే (జనవరి 16) నుంచే ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. అన్ని రకాల స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. యాక్సెసరిస్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని పేర్కొంది. ఇతర గాడ్జెట్స్, గృహోపకరణాలపై కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటుల అందుబాటులో ఉంటాయని అమెజాన్ ఇండియా పేర్కొంది. ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ తగ్గింపు ఇస్తోంది. కనీసం రూ.5,000కు పైన కొనుగోళ్లకు ఈ తగ్గింపు ఆఫర్ వర్తిస్తుంది. నాన్ ఈఎంఐ చెల్లింపులపై రూ.1,250, ఈఎంఐ చెల్లింపులపై రూ.1,500 తక్షణ డిస్కౌంట్ ఇస్తోంది.
(చదవండి: డబ్బులు పోయాయని కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేస్తే.. రూ.12 లక్షలు మాయం!)
Comments
Please login to add a commentAdd a comment