ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాలు రూ.25 లక్షల కోట్లను అధిగమించాయి. 2024 మార్చి త్రైమాసికం ముగిసే నాటికి ఈ మేరకు రుణాలున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి.
2023 మార్చి 31 నాటికి ఈ రుణాల విలువ రూ.16.14 లక్షల కోట్లు ఉండగా, 55.4 శాతం వృద్ధితో రూ.25.08 లక్షల కోట్లకు చేరినట్లు నియంత్రణ సంస్థలకు బ్యాంక్ రిపోర్ట్ చేసింది. 2023 జులై 1న హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల విలీనం తర్వాతి రుణాలు కాబట్టి, గత ఏడాదితో వీటిని పోల్చిచూడొద్దని బ్యాంకు వర్గాలు తెలిపాయి. త్రైమాసిక ప్రాతిపదికన 2023 డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే (రూ.24.69 లక్షల కోట్లు) 2024 మార్చి త్రైమాసికంలో 1.6 శాతం మాత్రమే రుణాలు పెరిగాయి.
ఇదీ చదవండి: పెరిగిన వెజ్ భోజనం ధర.. తగ్గిన నాన్‌వెజ్ ఖరీదు
దేశీయ రిటైల్ రుణాలు 2023 మార్చి 31తో పోలిస్తే 109 శాతం, డిసెంబరు 31తో పోలిస్తే 3.7 శాతం వృద్ధి చెందాయి. వాణిజ్య-గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు వరుసగా 24.6 శాతం, 4.2 శాతం మేర పెరిగాయి. బ్యాంక్ డిపాజిట్లు 2024 మార్చి 31 నాటికి రూ.23.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబరు 31 నాటికి రూ.22.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన రూ.18.83 లక్షల కోట్ల నుంచి 26.4 శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment