న్యూఢిల్లీ: గృహ రుణాల్లో అతిపెద్ద సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ.. వాట్సాప్ ద్వారా గృహ రుణలను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. కొనుగోలుదారులకు రెండు నిమిషాల్లోపే గృహ రుణానికి సంబంధించి సూత్రప్రాయ ఆమోదం ఇస్తున్నట్టు తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ వాట్సాప్ నంబర్ 9867000000కు రుణం కావాల్సిన వారు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ అందించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా హోమ్‌లోన్ ఆఫర్ లెటర్‌ను రెండు నిమిషాల్లోనే జారీ చేస్తుంది.
రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులు ఈ సేవ అందుబాటులో ఉంటుం దని హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. గృహ రుణ ఆమోద లేఖ జారీకి వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. మొదటిసారి ఇళ్ల కొనుగోలు దారుల నుంచే కాకుండా, ఇప్పటికే ఇంటిని సమకూర్చుకున్న వారి నుంచి సైతం డిమాండ్ ఉన్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ రేణు సూద్ కర్ణాడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment