సాక్షి, ముంబై: సొంత ఇల్లు కొనుగోలుచేయాలనుకునే వారికి దేశీయ అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంకు ఐసీఐసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. గృహరుణాలపై వడ్డీ రేటును 6.7 శాతంగానిర్ణయించింది. సవరించిన వడ్డీ రేటు, ఈ రోజు(మార్చి 5, శుక్రవారం) నుండి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఆ తగ్గింపు రేటు అందుబాటులో ఉంటుందని బ్యాంకు ప్రకటించింది. దీంతో హోమ్‌లోన్లపై బ్యాంకు వసూలుచేస్తున్న వడ్డీరేటు పదేళ్ల కనిష్ఠానికి దిగి రావడం విశేషం.
గృహ రుణాల కోసం వినియోగదారులు రూ.75 లక్షలలోపు రుణాలపై వడ్డీరేటు 6.7 శాతంగా ఉంటుంది. రూ.75 లక్షలకు మించినరుణాలపై వడ్డీరేటు మాత్రం 6.75 శాతం నుంచి మొదలవుతుందని ఐసీఐసీఐ సెక్యూర్డ్ అసెట్స్ హెడ్ రవి నారాయణన్ చెప్పారు. గత కొన్ని నెలలుగా గృహాలను కొనాలనుకునే సంఖ్య పెరుగుతోందని, డిమాండ్ తిరిగి పుంజుకుంటున్న నేపథ్యంలో తక్కువ వడ్డీ రేట్లతో వినియోగదారుల సొంత ఇంటి కల నెర వేర్చేందుకు ఇది సరైన సమయంగా తాము భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment