హోమ్ లోన్స్‌పై ఐసీఐసీఐ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై : దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. గృహ రుణం తీసుకునే వారికే పండుగ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు నెలల కాలవ్యవధి అంటే నవంబర్ 30 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కొత్తగా గృహరుణం పొందేవారు లేదా తమ పాత గృహరుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకుకు ట్రాన్సఫర్ చేసుకునే వారికి 20 శాతం క్యాష్ బ్యాక్ అంటే రూ.10వేల రూపాయల వరకు అందించనున్నట్టు బ్యాంకు చెప్పింది. కస్టమర్ ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుపై కనీసం రూ.30వేల కొనుగోళ్లు జరిపిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
బ్యాంకు వెబ్‌సైట్ తెలిపిన సమాచారం మేరకు సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్యలో కొత్తగా గృహరుణాలు పొందేవారికి, పాత గృహరుణాలను ఐసీఐసీఐకి ట్రాన్సఫర్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిసింది. 2017 డిసెంబర్ 31 వరకు ఈ మొత్తాన్ని అందించడం జరుగుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డు రెండూ కలిగి ఉన్న వారికి ఒకే కార్డుపై ఈ క్యాష్‌బ్యాక్‌ను బ్యాంకు ఇవ్వనుంది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు గృహరుణాల వడ్డీరేట్లు మహిళలకు 8.35 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. వేతన వ్యక్తులకైతే 8.40 శాతం నుంచి ఉన్నాయి. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు 8.50శాతం, ఇతరులకు 8.55శాతం వడ్డీకి రుణాలను మంజూరు చేస్తోంది.