
హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణంపై వడ్డీరేటు తగ్గింపు
న్యూఢిల్లీ: గృహరుణాలపై వడ్డీరేటును హెచ్‌డీఎఫ్‌సీ 0.2 శాతం తగ్గించింది. కొత్త వడ్డీరేటు 9.9 శాతమని, ఇది ఈ నెల 13 (సోమవారం)నుంచి అమల్లోకి వస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది.
కొత్త, పాత రుణగ్రహీతలకు ఇది వర్తిస్తుందని వివరించింది. వివిధ మెచ్యూరిటీ డిపాజిట్లపై రేట్లను కూడా హెచ్‌డీఎఫ్‌సీ తగ్గించింది. ఇంతకు ముందే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు వడ్డీరేట్లను తగ్గించాయి. ు