
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యకాలంలో గృహ రుణాలలో 26 శాతం వృద్ధి నమోదయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును పెంచకపోవటంతో బ్యాంక్‌లు 7 శాతం కంటే తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. 46 శాతం మంది బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ముందుకొచ్చారని మ్యాజిక్ బ్రిక్స్ తెలిపింది. ఆస్తి మీద రుణం తీసుకునే అంశాలలోనూ 20 శాతం పెరుగుదల నమోదు కావటం గమనార్హం. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాలు, తక్కువ వడ్డీ రేట్లు, ఆయా నగరాలలో అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల కారణంగా ఇళ్లను కొనేవారి సంఖ్య పెరిగింది.
దాదాపు 50 శాతం మంది 15 ఏళ్ల కంటే తక్కువ రుణ వ్యవధిని ఎంచుకుంటున్నారు. అంటే వీలైనంత త్వరగా గృహ రుణాలను కట్టేయాలని కొనుగోలుదారులు భావిస్తున్నారన్నమాట. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు సాధారణంగా గృహ రుణం చెల్లింపుల కోసం 25–30 ఏళ్ల దాకా గడువును ఇస్తున్నాయి. అయినప్పటికీ రుణాన్ని త్వరగా తీర్చేయాలన్న ఆలోచనతో ఇళ్ల కొనుగోలుదారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment