బీజింగ్: చైనా 2019 మూడవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) కేవలం 6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 1992 తరువాత ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు ప్రపంచ రెండవ ఆర్థిక వ్యవస్థలో నమోదుకావడం ఇదే తొలిసారని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకూ మరింత నష్టం వాటిల్లకుండా, అమెరికా–చైనా తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికివచ్చినకేవలం ఒక్కవారంలోనే తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం.
రెండవ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 6.2 శాతం. చైనా ఆర్థికవృద్ధి 2019లో 6.1 శాతంగానే ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఇటీవలే అంచనావేసిన సంగతి తెలిసిందే. కాగా 2019 మొదటి మూడు త్రైమాసికాలూ కలిపితే, చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంది. విలువలో చూస్తే, ఇది 69.79 ట్రిలియన్ యువాన్‌లు. అంటే దాదాపు 9.87 ట్రిలియన్ డాలర్లు. 6–6.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదుకావాలన్నది చైనా లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment