దేశంలో రిటైల్‌ జోరు..కోవిడ్‌ ముందస్తు స్థాయిల కంటే! | Retail Businesses Sales Growth Of 18% In July | Sakshi
Sakshi News home page

దేశంలో రిటైల్‌ జోరు..కోవిడ్‌ ముందస్తు స్థాయిల కంటే!

Aug 18 2022 8:19 AM | Updated on Aug 18 2022 8:19 AM

Retail Businesses Sales Growth Of 18% In July - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్‌ వ్యాపారాలు కోవిడ్‌ ముందస్తు స్థాయిల కంటే ఆరోగ్యకరమైన వృద్ధిని కొనసాగించాయి. 2019తో పోలిస్తే ఈ ఏడాది జూలై అమ్మకాలు 18 శాతం పెరిగాయని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం తెలి పింది.

‘రిటైల్‌ వ్యాపారం తూర్పు భారత్‌లో అత్యధికంగా 25% వృద్ధి సాధించింది. దక్షిణాదిలో 21, ఉత్తరాది 16, పశ్చిమ భారత్‌లో 10% అధికమైంది. అత్యధికంగా 32 శాతం వృద్ధితో క్రీడా సామాగ్రి అమ్ముడైంది. పాదరక్షలు, ఫర్నీ చర్, గృహాలంకరణ వస్తువుల విభాగాలు ఒక్కొక్కటి 23 శాతం, దుస్తులు, వస్త్రాలు 22, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు, గృహాపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ 17%  దూసుకెళ్లాయి. 

ఆభరణాలు 15 శాతం, ఆహారం, సరుకులు 11, సౌందర్య సాధనాలు, వెల్‌నెస్, వ్యక్తిగత సంరక్షణ 3%  పెరిగాయి. పండుగల సీజన్‌లో మెరుగైన విక్ర యాలు ఉంటాయని రిటైలర్లు ఆభాభావం వ్యక్తం చేస్తున్నారు. రిటైల్‌ వ్యాపారాలు 2019తో పోలిస్తే జూన్‌లో 13 శాతం ఎగశాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement