Retailers market
-
దేశంలో రిటైల్ జోరు..కోవిడ్ ముందస్తు స్థాయిల కంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారాలు కోవిడ్ ముందస్తు స్థాయిల కంటే ఆరోగ్యకరమైన వృద్ధిని కొనసాగించాయి. 2019తో పోలిస్తే ఈ ఏడాది జూలై అమ్మకాలు 18 శాతం పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బుధవారం తెలి పింది. ‘రిటైల్ వ్యాపారం తూర్పు భారత్‌లో అత్యధికంగా 25% వృద్ధి సాధించింది. దక్షిణాదిలో 21, ఉత్తరాది 16, పశ్చిమ భారత్‌లో 10% అధికమైంది. అత్యధికంగా 32 శాతం వృద్ధితో క్రీడా సామాగ్రి అమ్ముడైంది. పాదరక్షలు, ఫర్నీ చర్, గృహాలంకరణ వస్తువుల విభాగాలు ఒక్కొక్కటి 23 శాతం, దుస్తులు, వస్త్రాలు 22, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, గృహాపకరణాలు, ఎలక్ట్రానిక్స్ 17% దూసుకెళ్లాయి. ఆభరణాలు 15 శాతం, ఆహారం, సరుకులు 11, సౌందర్య సాధనాలు, వెల్నెస్, వ్యక్తిగత సంరక్షణ 3% పెరిగాయి. పండుగల సీజన్లో మెరుగైన విక్ర యాలు ఉంటాయని రిటైలర్లు ఆభాభావం వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ వ్యాపారాలు 2019తో పోలిస్తే జూన్‌లో 13 శాతం ఎగశాయి. -
బంగారం ఆభరణాల వర్తకులకు మరింత ఆదాయం
ముంబై: బంగారం ఆభరణాల విక్రయదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–14 శాతం అధికంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. బంగారం ధరలు స్థిరంగా ఉండడానికితోడు వివాహాలు, పండుగల కోసం ఆభరణాలపై ఖర్చు చేయడం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. వరుసగా రెండు సంవత్సరాల క్షీణత తర్వాత ఆదాయంలో వృద్ధి ఉంటుందన్న అంచనాకు వచ్చింది. 2019–20, 2020–21 సంవత్సరాల్లో మూడు శాతం, ఎనిమిది శాతం చొప్పున ఆభరణాల విక్రేతల ఆదాయం క్షీణించినందున.. తక్కువ స్థాయిల నుంచి (లోబేస్) చూస్తే వృద్ధి మెరుగ్గా ఉండొచ్చని తన నివేదికలో పేర్కొంది. ‘‘2019 జూలైలో బడ్జెట్ సందర్భంగా బంగారం దిగుమతిపై సుంకాన్ని 12.5 శాతానికి పెంచడం డిమాండ్‌పై ప్రభావం చూపంచగా.. 2020–21లో కరోనా వల్ల విధించిన లాక్డౌన్లతో దుకాణాలు మూతపడి ఆదాయంపై ప్రభావం పడేలా చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంఘటిత ఆభరణాల వర్తకులకు తక్కువ దిగుమతి సుంకం వల్ల.. హాల్‌మార్క్ తప్పనిసరి చేయడం వల్ల ఆదాయం పెరగనుంది. అసంఘటిత రంగంలోని వారితో పోలిస్తే ఈ మార్పులు సంఘటిత రంగంలోని వారి పోటీతత్వాన్ని పెంచుతాయి’’ అని క్రిసిల్ పేర్కొంది. 2020–21లో క్రిసిల్ రేటింగ్ ఇచ్చిన 86 ఆభరణాల సంస్థల ఉమ్మడి ఆదాయం రూ.62,000 కోట్లుగా ఉండడం గమనార్హం. చదవండి: అంత బంగారాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి..! -
రిటైల్ అమ్మకాలు పుంజుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయాలు గాడిన పడుతున్నాయి. కరోనా ముందు నాటి విక్రయాల్లో (2019 జూలై) 72 శాతానికి ఈ ఏడాది జూలైలో చేరినట్టు రిటైలర్ల జాతీయ సంఘం (రాయ్) తెలిపింది. రానున్న పండుగల సందర్భంగా విక్రయాలు మరింత జోరందుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈఏడాది జూన్‌లో కరోనా ముందు నాటి విక్రయాల్లో 50 శాతానికి కోలుకున్నట్టు తెలిపింది. దక్షిణాదిన రిటైల్ అమ్మకాలు మరింత బలంగా ఉన్నట్టు వివరించింది. కరోనా ముందు నాటితో పోలిస్తే 82 శాతానికి పుంజుకున్నాయని తెలిపింది. పశ్చిమభారతావనిలో విక్రయాలు ఇంకా కోలుకోవాల్సి ఉందంటూ.. జూలైలో 57 శాతానికి చేరినట్టు వివరించింది. మహారాష్ట్రలో లాక్డౌన్లు సుదీర్ఘకాలం పాటు కొనసాగడమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. వేగంగా సేవలు అందించే రెస్టారెంట్ల వ్యాపారం (క్యూఎస్ఆర్) ఈ ఏడాది జూలైలో కరోనా ముందు నాటితో పోలిస్తే 97 శాతానికి చేరుకున్నట్టు రాయ్ తెలిపింది. ఆధునిక రిటైల్ వ్యాపారంపై ఆంక్షలను తొలగించి, సాఫీ కార్యకలాపాలకు వీలు కల్పిస్తున్నందున రానున్న పండుగల సీజన్లో విక్రయాలు గణనీయంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ వివరించారు. -
రిటెయిలర్ మార్కెట్‌కూ ఓ విధానం
ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రిటెయిలర్ మార్కెట్ విధానాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం సచివాలయంలో రిటెయిల్ మార్కెట్ ప్రతినిధులు.. కబీర్(లైఫ్‌స్టైల్), వేణుగోపాల్ (రిలయన్స్), మురళి(వాల్‌మార్ట్), రవీందర్ (షాపర్స్‌స్టాప్), రాకేష్(బిగ్‌బజార్), మరికొం దరు అసోసియేషన్ ప్రతినిధులు సీఎంను కలి శారు. తెలంగాణలో రిటెయిల్ మాల్స్‌ను విస్తరించనున్నట్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. 365 రోజులపాటు తమ మాల్స్ తెరిచి ఉంచేలా అనుమతించడంతోపాటు, ఒకచోట లెసైన్స్ పొందిన సంస్థ అనుబంధ శాఖలను అదే లెసైన్స్‌పై ఏర్పాటు చేసుకోవడానికి వీలుకల్పించాలని, రాత్రివేళల్లో మహిళా ఉద్యోగులు పనిచేయడానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. వీటిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పందిస్తూ మాల్స్ ఉద్యోగులకు వారానికి ఒక సెలవు ఇవ్వాలని, రాత్రివేళ్లల్లో విధులు నిర్వహించే మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మాల్స్ ఏర్పాటు అభివృద్ధికి ఓ సూచిక అని అన్నారు. మాల్స్, రిటెయిల్ షాపింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణకు ఓ విధానం తీసుకుని రావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సీఎం వివరించారు.