సాక్షి, అమరావతి: అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదని, అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న గొప్ప విజన్ ఉండటమే కాకుండా దాన్ని అక్షరాల చేతల్లో చూపించిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన రూపొందించిన పారిశ్రామిక విధానాలు పరిశ్రమలకు వరాలే అయ్యాయి. అందుకే ఉమ్మడి రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. వైఎస్సార్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో పెట్టుబడులు ఏటా సగటున 54 శాతం వృద్ధి చెందాయి. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం 7వ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది. ఈ స్థాయి వృద్థి రేటును అంతకుముందు సీఎంలు, వైఎస్ తర్వాత సీఎంలు ఎవ్వరూ అందుకోలేకపోయారు. ఆయన మరణించి పదేళ్లు అయినా వైఎస్సార్ హయాం పారిశ్రామిక రంగానికి స్వర్ణయుగం. అందుకే ఇప్పటికీ పారిశ్రామికవేత్తలు గుర్తు చేసుకుంటున్నారు.
వైఎస్సార్ సీఎం కాకముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన ముఖ్యమంత్రులందరూ అభివృద్ధినంతా హైదరాబాద్‌కే పరిమితం చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధిని తన దార్శినికతతో అన్ని ప్రాంతాలకు విస్తరించారు. వైఎస్సార్ అభివృద్ధి చేసిన శ్రీ సిటీ, అపాచీ, బ్రాండిక్స్, రాంకీ ఫార్మా వంటి భారీ ప్రత్యేక ఆర్థిక మండళ్లకు తోడు విశాఖ, విజయవాడ, కాకినాడల్లో ఏర్పాటు చేసిన ఐటీ సెజ్‌లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిపోర్టు, పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే, బయోటెక్నాలజీ పార్క్, కృష్ణపట్నం పోర్టు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు , టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, కైజెన్ టెక్నాలజీస్ వంటి అనేక ప్రాజెక్టులు ఆయన హయాంలోనే నెలకొల్పారు. ఇవే కాకుండా వాడరేవు, నిజాంపట్నం, బందరు పోర్టు, విశాఖ–కాకినాడ పెట్రో కారిడార్, ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్, బ్రాహ్మణీ స్టీల్స్ వంటి అనేక కలల ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి రూ. 11,659 కోట్ల విలువైన పెట్టుబడులు మాత్రమే అమల్లోకి వస్తే.. వైఎస్సార్ ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ. 43,117 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. వైఎస్సార్ హయాంలో ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి నమోదైంది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తండ్రి వైఎస్సార్ బాటనే అనుసరిస్తున్నారు. అభివృద్ధి కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా మూడు రాజధానులతో పాటు పారిశ్రామికంగా అదే బాటను అనుసరిస్తున్నారు.
పరిశ్రమలకు వరాలు
Published Sat, Sep 2 2023 5:13 AM | Last Updated on Sat, Sep 2 2023 3:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment