ముంబై: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం మొదలైందని, ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధి రేటు సాధ్యమేనని ఆర్‌బీఐ పేర్కొంది. దేశీ స్థూల ఆర్థిక పరిస్థితులు బలంగానే ఉన్నాయంటూ.. అదే సమయంలో అంతర్జాతీయ సంక్షోభాల సమస్యల ప్రభావం ఉంటుందని శుక్రవారం విడుదలైన ఆర్‌బీఐ ఆర్టికల్ పేర్కొంది. ఆర్‌బీఐ తాజా బులెటిన్‌లో భాగంగా ఈ ఆర్టికల్‌ను ప్రచురించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గమనంపై మేఘాలు కమ్ముకునే ఉన్నాయంటూ, ఇక్కడి నుంచి ఇంకా తగ్గుముఖం పట్టే రిస్క్‌లు ఉన్నట్టు తెలిపింది. (ట్విటర్ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్ మస్క్‌కు మరో షాక్!)
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారుతుండడం, మార్కెట్ లిక్విడిటీ తగ్గుతుండడం ఆర్థిక సాధనాల రేట్లపై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. ‘‘పాలసీ రేట్ల మోస్తరు పెంపును మార్కెట్లు సర్దుబాటు చేసుకుంటున్నాయి. రిస్క్ తీసుకునే ధోరణి తిరిగి ఏర్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థలో సరఫరా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పట్టణాల్లో డిమాండ్ బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పుంజుకోలేదు. కాకపోతే ఇటీవలే కొంత మెరుగుపడడం ఆశావహం’’అని ఆర్‌బీఐ ఆర్టికల్ తెలిపింది. దీన్ని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ దేవబ్రత పాత్ర రూపొందించారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 6.1-6.3 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొంది.
ఇది నిజమైతే 2022-23 సంవత్సరానికి జీడీపీ 7 శాతం వృద్ధిని చేరుకునే క్రమంలోనే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చని తెలిపింది. ఆర్‌బీఐ రోజువారీగా వ్యవస్థ నుంచి రూ.1.5 లక్షల కోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు చెబుతూ.. మానిటరీ పాలసీకి అనుగుణంగా వ్యవస్థలో లిక్విడిటీ సాధారణ స్థితికి చేరినట్టు వివరించింది. అయినప్పటికీ ఇంకా కొంత మిగులే ఉన్నట్టు తెలిపింది. (మస్క్ 13 కిలోల వెయిట్ లాస్ జర్నీ: ఫాస్టింగ్ యాప్‌పై ప్రశంసలు)
Comments
Please login to add a commentAdd a comment