అభ్యర్థులకు సూచనలిస్తున్న కౌన్సెలింగ్ సిబ్బంది(ఫైల్)
యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి)
రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో 28,770 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఏపీఎడ్‌సెట్–2016 కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 27 నుంచి 29 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. విద్యార్థులు పెట్టుకున్న వెబ్‌ఆప్షన్ల మేరకు బుధవారం సీట్ల కేటాయింపు చేశామన్నారు. మూడు రోజుల పాటు జరిగిన వెబ్ కౌన్సెలింగ్‌కు 3,657 మంది హాజరై, సర్టిఫికెట్లను పరిశీలింప చేసుకున్నారన్నారు. 487 కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 32,145 సీట్లకు గాను 3,375 మందికి సీట్లను కేటాయించామన్నారు. సీట్లు కేటాయింపబడిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ విద్యార్థులకు ఈ నెల 8వతేదీనుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామన్నారు.